గుంటూరు, సాక్షి: ఏపీలో ప్రస్తుతం నెలకొన్న అన్యాయమైన పరిస్థితులు.. బహుశా స్వాతంత్ర వచ్చిన తర్వాత ఎక్కడా చూసి ఉండరని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని గురువారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న పరిస్థితుల మధ్య రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. రాష్ట్రంలో చీకటి రోజులు నడుస్తున్నాయి. ఎన్నికలప్పుడు ఏం చెప్పారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు?. ప్రశ్నించే స్వరం ఉండకూడదని.. అణగదొక్కే చర్యలు కనిపిస్తున్నాయి. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అన్నారు. అన్ని వర్గాలను మోసం చేశారు.
.. మూడు విడతలుగా ఇవ్వాల్సిన విద్యాదీవెన ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీ అటకెక్కింది. ఆర్‌బీకేలను నిర్వీర్యం చేశారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను గాలికి వదిలేశారు. ఇలా అన్ని రకాలుగా ప్రభుత్వం ఫెయిలయ్యింది.
.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దారుణంగా ఉంది. మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు పెరిగిపోయాయి. ఐదు నెలల్లో మహిళలు, పిల్లలపై.. 91 ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిల్లో ఏడుగురు బాధితులు చనిపోయారు. తెలుగు దేశం పార్టీ కార్యకర్తలే దగ్గరుండి ఈ పనులు చేస్తున్నారు.
.. ప్రభుత్వం స్పందించి నేరాల్ని అరికట్టకుండా.. ప్రొత్సహిస్తోంది. తెనాలిలో ఓ అమ్మాయిపై దాడి చేసి చంపారు. నిందితుడు.. టీడీపీకి చెందిన వ్యక్తే. బద్వేల్ ఘటన.. అత్యంత దారుణం. పెట్రోల్ పోసి బాలికను చంపారు. చంద్రబాబు బావమరిది బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురంలో ఘటన జరిగింది. అత్తాకోడలపై అత్యాచారం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో ఓ ఘటన జరిగింది. ప్రతీచోటా ఇలాంటి ఘోరమైన ఘటనలు జరుగుతున్నాయి అని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment