మా కోసం కథ రాయమని అడగలేదు | Naga chaitanya interview about majili movie | Sakshi
Sakshi News home page

మా కోసం కథ రాయమని అడగలేదు

Published Thu, Apr 4 2019 4:10 AM | Last Updated on Thu, Apr 4 2019 4:10 AM

Naga chaitanya interview about majili movie - Sakshi

నాగచైతన్య

‘‘నటుడిగా నాకు అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. కానీ రొమాన్స్‌ జానర్‌లో ఆడియన్స్‌ నన్ను ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు. వైవిధ్యం ఉన్న కథలు వచ్చినప్పుడు ప్రయోగాత్మక సినిమాలు చేయడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను. హానెస్ట్‌ అండ్‌ రియలిస్టిక్‌ అప్రోచ్‌ కూడా ఉండాలి. ప్రస్తుతం రొమాన్స్‌ జానర్‌ నా ఫేవరెట్‌గా ఫీల్‌ అవుతున్నాను’’ అని నాగచైతన్య అన్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటించిన చిత్రం ‘మజిలీ’. సమంత, దివ్యాంకా కౌశిక్‌ కథానాయికలుగా నటించారు. సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగచైతన్య చెప్పిన విశేషాలు.

► నేను, స్యామ్‌ (సమంత) కలిసి ‘ఏమాయ చేసావే, మనం, ఆటోనగర్‌ సర్య’ సినిమాలు చేశాం. అన్నీ ప్రేమకథలే. మా వివాహం తర్వాత విభిన్నమైన కథ ప్రయత్నిస్తే బాగుంటుందనుకున్నాం. సరిగ్గా అలాంటి స్క్రిప్ట్‌నే శివ తీసుకుని వచ్చాడు. పెళ్లి తర్వాత భార్యాభర్తల జీవితాల్లో ఉండే ఎత్తుపల్లాలు ఏంటి? ఎలాంటి సమస్యలు వస్తాయి? వంటి అంశాలతో కూడిన చిత్రం ‘మజిలీ’. ఇలాంటి చిత్రం మా దగ్గరకు రావడం చాలా హ్యాపీగా అనిపించింది.

► నాకు, స్యామ్‌కి కథ రాయమని నేను శివను అడగలేదు. శివ తొలి సినిమా ‘నిన్ను కోరి’ చూశాను. నచ్చింది. ముఖ్యంగా ఆ సినిమా క్లైమాక్స్‌ను శివ హానెస్ట్‌గా డీల్‌ చేయడం పట్ల ఇంప్రెస్‌ అయ్యాను. అలాంటి సినిమాలంటే నాకు ఇష్టం. మంచి కథ ఉంటే సినిమా చేసే ఆలోచన ఉందని శివతో అన్నాను.
ఓ రెండు నెలల తర్వాత శివ ‘మజిలీ’ స్టోరీ లైన్‌ చెప్పారు. బాగా ఎగై్జట్‌ అయ్యాను. అప్పుడే స్యామ్‌ ఉంటే బాగుంటుందని అనుకున్నాం. సినిమాలో ఓ హీరోయిన్‌గా స్యామ్‌ను సజెస్ట్‌ చేసింది శివనే. కథపై దాదాపు 7 నెలలు వర్క్‌ చేశాం. ఈ ప్రాసెస్‌లో నేను, శివ మంచి మిత్రులైపోయాం. హీరో, డైరెక్టర్‌ రిలేషన్‌షిప్‌ను బాగా ఎంజాయ్‌ చేశాను. పూర్ణ క్యారెక్టర్‌ చేయడం కూడా నాకు ఈజీ అయింది.

► స్క్రిప్ట్‌ విన్నప్పుడు ఈ క్యారెక్టర్‌కి బాగా హార్డ్‌వర్క్‌ చేయాలనుకున్నాను. సినిమాలోని పూర్ణ పాత్ర కోసం శివ నన్ను బాగా ప్రిపేర్‌ చేశాడు. నిజానికి నాకు బ్యాట్‌ పట్డుకోవడం కూడా రాదు. నాలుగు నెలలు కష్టపడి క్రికెట్‌ నేర్చుకున్నాను. మ్యాచ్‌లు ఆడలేను కానీ కెమెరా ముందు ఆడతాను. అలాగే పూర్ణ క్యారెక్టర్లో ఏజ్‌ డిఫరెన్స్‌ చూపించడానికి పెద్దగా కష్టపడలేదు. కొంచెం గ్యాప్‌ తీసుకుని డైట్‌ ఫాలో అయ్యాను.

► కొత్త హీరోయిన్‌ అయితే స్నేహం పెరగడానికి కాస్త టైమ్‌ పడుతుంది. స్యామ్‌తో అలా కాదు. మంచి కంఫర్ట్, అండర్‌స్టాండింగ్‌ ఉంటుంది. తప్పులు అర్థమైపోతాయి. ఒకరికొకరం సహాయం చేసుకుంటాం. ఈ సినిమాలోని క్లైమాక్స్‌ సీన్స్‌ కోసం ఇంట్లో కాస్త డైలాగ్స్‌ ప్రాక్టీస్‌ చేశాం. కానీ సాధారణంగా 9–6 వర్క్‌ మోడ్‌లో ఉంటాం. సాయంత్రం 6కి ఆఫ్‌ అయిపోతాం. కొత్త కథలు వచ్చినప్పుడు భవిష్యత్‌లో ఇద్దరం కలిసి ఇంకా సినిమాలు చేస్తాం.

► సినిమాలో శ్రావణి క్యారెక్టర్‌ను స్యామ్‌ చేయడం ప్లస్సే. మంచి ఇంటెన్స్‌ ఉన్న క్యారెక్టర్‌. నాకు కూడా అడ్వాంటేజ్‌ అయ్యింది. స్యామ్‌ తనకంటే నా గురించే ఎక్కువగా ఆలోచిస్తుంది. అది తన స్వభావం. నాకు నిజంగానే మంచి అమ్మాయి జీవిత భాగస్వామిగా దొరికింది.

► ఇప్పటివరకు నేను చేసిన 60 శాతం సినిమాల్లో... ఇది కరెక్ట్‌గా వెళ్తుందా? మనం ఫస్ట్‌ అనుకున్న కథనే తీస్తున్నామా? ఎక్కువ మార్పులు చేశామా? అనే ఆలోచనలు వచ్చాయి. అది నా నటనపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. కొంచెం డౌట్‌ ఉంటే నాకు తెలిసిపోతుంది. ఈ సినిమా చేసేప్పుడు నాకు డౌటేమీ లేదు.

► ‘మజిలీ’లాంటి స్క్రిప్ట్‌ని ఓకే చేయాలంటే నిర్మాతలకు ధైర్యం ఉండాలి. నాకు, సమంతకు ప్రెస్టేజియస్‌ ప్రాజెక్ట్‌ కూడా. మన బేనర్‌లో మీ ఇద్దరితో కలిసి నేను ఎందుకు తీయలేదు? అని నాన్నగారు కూడా ఓ సందర్భంలో అన్నారు. నాన్నగారు ఇంకా సినిమా చూడలేదు.

► కొన్ని సినిమాలు బాగా ఆడతాయనుకున్నాను. ఆడలేదు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా జీవితంలో అందరికీ సమస్యలు ఉంటాయి. వైఫల్యాలను తట్టుకుని      జీవి
తంలో ఎలా నెగ్గుకు వస్తాం అన్నదే ముఖ్యం. సినిమాలోని పూర్ణ క్యారక్టర్‌ కూడా అలానే ఉంటుంది. సమంత తమిళంలో నటించిన ‘సూపర్‌ డీలక్స్‌’ సినిమా చూశాను. బాగా నచ్చింది. సమంతనే కాదు. అందరూ బాగా నటించారు. కథ నచ్చితే ఇలాంటి సినిమాలు చేయడం నాకు ఇష్టమే.

► రేసింగ్‌ నాకు ఇష్టమైన స్పోర్ట్‌. ప్రజెంట్‌ ‘క్రికెట్, ఫుట్‌బాల్, కబడ్డీ’ బ్యాక్‌డ్రాప్‌ సినిమాలకు ఆడియన్స్‌ బాగా కనెక్ట్‌ అవుతున్నారు. రేసింగ్‌పై సినిమా గురించి భవిష్యత్‌లో ఆలోచిస్తాను. అయితే స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమాలు చేయడం నాకు ఇష్టమే.

► వెంకటేశ్‌గారి కామెడీ టైమింగ్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం చాలెంజింగ్‌గా ఉంది. ఈ నెల 8నుంచి ‘వెంకీమామ’ సెట్‌లో జాయిన్‌ అవుతాను. జూలై కల్లా షూటింగ్‌ను పూర్తి చేసే ప్లాన్‌లో ఉన్నాం. అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాన్నగారు ‘సోగ్గాడే చిన్నినాయనా’ రెండో పార్టును ప్లాన్‌ చేస్తున్నారు. అంతా ఓకే అనుకుంటే ఆగస్టులో సెట్స్‌కు వెళ్లిపోతాం. ఇంకా కథలు వింటున్నాను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement