
స్క్రీన్ టెస్ట్
♦ ‘ఏ మాయ చేసావె’ అంటే నాగచైతన్య, సమంతే గుర్తొస్తారు. కానీ, దర్శకుడు గౌతమ్ మీనన్ ఫస్ట్ ఛాయిస్ నాగచైతన్య కాదు. ఆయన ఈ కథతో ఏ హీరో దగ్గరకు వెళ్లారో చెప్పుకోండి?
ఎ) మహేశ్‌బాబు బి) నాని సి) రామ్‌చరణ్ డి) రామ్
♦ ‘బాహుబలి’ దర్శకుడు రాజమౌళి, కథారచయిత విజయేంద్రప్రసాద్! మరి, ఆ సినిమాకు మాటలు రాసింది ఎవరు?
ఎ) పరుచూరి బ్రదర్స్ బి) కోన వెంకట్–గోపీమోహన్ సి) అజయ్–విజయ్ డి) అబ్బూరి రవి
♦ ఏయన్నార్ మనవడు సుమంత్‌కు అఖిల్ ఏమవుతారు?
ఎ) బావమరిది బి) తమ్ముడు సి) బావ డి) అన్నయ్య
♦ ఏ సినిమాలోని ఫైట్స్ కోసం అల్లు అర్జున్ థాయ్‌ల్యాండ్ వెళ్లి నాన్‌చాక్‌తో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు?
ఎ) సరైనోడు బి) బద్రీనాథ్ సి) దేశముదురు డి) బన్నీ
♦ ‘కృష్ణా నగరే మావా... కృష్ణానగరే మావా’ పాటలో తొలి చరణం ఏ వాక్యంతో మొదలవుతుంది?
ఎ) సినిమాలే లైఫ్‌రమావా లైఫంతా సినిమా మావా బి) పని ఉంటే మస్తుర మావా లేకుంటే పస్తులు మావా
సి) ఎన్నెన్నో ఆశలున్నవీ ఏవేవో ఊహలున్నవీ డి) షూటింగే జరిగినప్పుడు ప్రతి రోజూ పెళ్లి సందడే
♦ ‘సర్దార్ గబ్బర్‌సింగ్’లో ఫస్ట్ హీరోయిన్‌గా ఎంపికైంది ఈవిడే... కాజల్ అగర్వాల్ కాదు! షూటింగ్ మొదలయ్యే సరికి సినిమాలో హీరోయిన్ మారారు.
ఎ) రెజీనా బి) రకుల్‌ప్రీత్ సింగ్ సి) పూజా హెగ్డే డి) అనీషా ఆంబ్రోస్
♦ ‘ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నార్రా నాన్నా’ – మహేశ్‌బాబు చెప్పిన ఈ డైలాగ్
ఏ సిన్మాలోనిది?
ఎ) అతడు బి) పోకిరి సి) అతిథి డి) అర్జున్
♦ చిరంజీవి కోటిరూపాయలకు పైగా పారితోషకం అందుకున్న తొలి సినిమా ఏది?
ఎ) అత్తకు యముడు అమ్మాయికి మొగుడు బి) ముగ్గురు మొనగాళ్లు
సి) జగదేకవీరుడు అతిలోక సుందరి డి) ఆపద్బాంధవుడు
♦ ‘ఓం నమో వేంకటేశాయ’లో ప్రగ్యా జైశ్వాల్ వేసుకున్న ఈ డ్రస్ చాలా బాగుంది కదూ! కానీ, దాన్ని మోయడానికే ప్రగ్యా కొంచెం కష్టపడ్డారు. ఆమెను అంతగా కష్టపెట్టిన ఈ లెహెంగా బరువెంతో తెలుసా?
ఎ) 14 కిలోలు బి) 24 కిలోలు సి) 4 కిలోలు డి) 20 కిలోలు
♦ రీసెంట్‌గా ‘సింక్ సౌండ్’ అనే పదం ఎక్కువ వినపడుతోంది. అంటే ఏంటో తెలుసా?
ఎ) షూటింగ్ చేసేటప్పుడే డైలాగులు రికార్డు చేయడం బి) సీన్‌కు తగ్గట్టు రీ–రికార్డింగ్ చేయించడం
సి) స్పెషల్ టెక్నిక్‌తో డైలాగులను రీ–క్రియేట్ చేయడం డి) రీ–రికార్డింగ్, డైలాగులను కరెక్ట్‌గా సింక్ చేయడం
♦ రాజశేఖర్ కర్ణుడిగా, శ్రీకాంత్ అర్జునుడిగా నటించిన సినిమా ఏది?
ఎ) శ్రీకృష్ణపాండవీయం బి) యమలీల సి) ఘటోత్కచుడు డి) అభిమన్యుడు
♦ ‘అడవి రాముడు’ అంటే ఎన్టీఆర్‌తో పాటు కె. రాఘవేంద్రరావు డైరెక్షన్ గుర్తొస్తుంది. ఎన్టీఆర్‌తో ఆయనది సూపర్‌హిట్ కాంబినేషన్. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ఎన్ని సినిమాలు వచ్చాయి?
ఎ) తొమ్మిది బి) పది సి) పదకొండు డి) పన్నెండు
♦ హీరో జగపతిబాబు తండ్రి వీబీ రాజేంద్రప్రసాద్ దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేశారు. అందులో బాలకృష్ణకు మేనమామగా ఏయన్నార్ నటించారు. ఆ సినిమా పేరేంటో చెప్పుకోండి!
ఎ) ఆత్మబలం బి) భార్యాభర్తలబంధం సి) కథానాయకుడు డి) ముద్దుల మావయ్య
♦ ‘అపరిచితుడు’ విక్రమ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. తమిళంలో హీరో కాకముందు తెలుగులో సినిమాలు చేశారు. దాసరి దర్శకత్వంలో విక్రమ్ ఓ హీరోగా నటించిన సిన్మా ఏది?
ఎ) బంగారు కుటుంబం బి) నాన్నగారు సి) ఆడాళ్లా మజాకా డి) చిరునవ్వుల వరమిస్తావా
♦ బ్యాచిలర్ పార్టీలో ముగ్గురు ఫ్రెండ్స్ ఫుల్లుగా మందేసి ఏదేదో చేస్తారు. తీరిగ్గా తెల్లారిన తర్వాత నిద్రలేచి రాత్రి ఏం జరిగిందో గుర్తు చేసుకుంటారు! – హాలీవుడ్ ఫిల్మ్ ‘హ్యాంగోవర్’ కాన్సెప్ట్ ఇది. ఈ సిన్మా కంటే నాలుగేళ్ల ముందు ఇంచుమించు ఇదే కాన్సెప్ట్‌తో తెలుగులో ఛార్మీ హీరోయిన్‌గా వచ్చిన సినిమా ఏది?
ఎ) అనుకోకుండా ఒక రోజు బి) కావ్యాస్ డైరీ సి) నగరం నిద్రపోతున్న వేళ డి) మనోరమ
♦ తాప్సీ, తమన్నా... మ్యాగ్జిమమ్ వీళ్లిద్దరికీ డబ్బింగ్ చెప్పేది ఒక్కరే. ఆవిడెవరో తెలుసా?
ఎ) ప్రియాంక బి) సౌమ్యా శర్మ సి) హరిత డి) చిన్మయి
♦ ఈ యంగ్ సింగర్ ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ రఘు భార్య!
ఎ) మాళవిక బి) ప్రణవి సి) మానస డి) రమ్యా బెహ్రా
♦ ‘మగధీర’లోని ‘ధీర ధీర ధీర మనసాగలేదురా...’ పాటకు కొరియోగ్రాఫర్ ఎవరో తెలుసా? చిన్న హింట్: ఈ పాటకు ఆయన నంది అవార్డు అందుకున్నారు.
ఎ) శివశంకర్ బి) శోభి సి) ప్రేమ్ రక్షిత్ డి) జానీ
♦ఎన్టీఆర్, సావిత్రి, జమున... ఈ ముగ్గురూ కలసి నటించిన ఈ స్టిల్ ఏ సిన్మాలోనిది?
ఎ) మాయాబజార్ బి) దేవత సి) మిస్సమ్మ డి) గుండమ్మ కథ
♦ ఈ ఫొటోలోని చెన్నై చిన్నారి ఇప్పుడు తెలుగు–తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్!
ఎ) సమంత బి) శ్రుతీ హాసన్ సి) ప్రియా ఆనంద్ డి) త్రిష
మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి!
సమాధానాలు
1) ఎ 2) సి 3) ఎ 4) బి 5) సి 6) డి 7) బి 8) డి
9) ఎ 10) ఎ 11) సి 12) ఎ 13) బి 14) ఎ
15) ఎ 16) ఎ 17) బి 18) ఎ 19) సి 20) డి