సెంటిమెంట్ మీదే అఖిల్ ఆశలు | Sentiment favouring Akhil Success | Sakshi
Sakshi News home page

సెంటిమెంట్ మీదే అఖిల్ ఆశలు

Published Thu, Jun 23 2016 1:40 PM | Last Updated on Mon, Sep 4 2017 3:13 AM

సెంటిమెంట్ మీదే అఖిల్ ఆశలు

సెంటిమెంట్ మీదే అఖిల్ ఆశలు

అఖిల్ సినిమాతో గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నటవారసుడు, తొలి సినిమాతో అనుకున్న విజయం సాధించలేకపోయాడు. భారీ బడ్జెట్తో తెరకెక్కిన అఖిల్ నిరాశపరచటంతో రెండో సినిమా విషయంలో చాలా రోజులుగా కసరత్తులు చేస్తున్నాడు. అయితే ఇప్పటికే రెండో సినిమా విషయంలో ఓ డెసిషన్కు వచ్చారన్న టాక్ వినిపిస్తోంది. సోగ్గాడే చిన్ని నాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అఖిల్ రెండో సినిమా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది.

కళ్యాణ్ కృష్ణ మీద నమ్మకంతో పాటు మరో సెంటిమెంట్ కూడా అఖిల్ సినిమాకు ప్లస్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు అక్కినేని కుటుంబ సభ్యులు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ వారసులకు రెండో సినిమా బాగా కలిసొస్తుందన్న నమ్మకం ఉంది.

ఎన్టీఆర్కు స్టూడెంట్ నెంబర్ 1, అల్లు అర్జున్కు ఆర్య, నాగచైతన్యకు ఏం మాయ చేసావే, రామ్ చరణ్కు మగధీర ఇలా స్టార్ వారసుల రెండో సినిమాలు భారీ హిట్స్గా నిలిచాయి. అఖిల్ రెండో సినిమా కూడా ఇదే లిస్ట్లో చేరుతుందన్న ఆశతో ఉన్నారు. మరి సెకండ్ సినిమా సెంటిమెంట్ అఖిల్కు వర్క్ అవుట్ అవుతుందో లేదో..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement