నాగ్ కన్ఫామ్ చేశాడు
వరుస సూపర్ హిట్స్తో దూసుకుపోతున్న నాగార్జున, తన తనయుల విషయంలో మాత్రం ఆ జోరు చూపించలేకపోతున్నాడు.
వరుస సూపర్ హిట్స్తో దూసుకుపోతున్న నాగార్జున, తన తనయుల విషయంలో మాత్రం ఆ జోరు చూపించలేకపోతున్నాడు. నాగచైతన్య హీరోగా ఆకట్టుకున్నా, సొంత ఫాలోయింగ్ ను, స్టార్ ఇమేజ్ను మాత్రం సొంతం చేసుకోలేకపోయాడు. ఇక భారీ అంచనాల మధ్య తెరకు పరిచయం అయిన చిన్న కొడుకు అఖిల్ కూడా తొలి సినిమాతోనే నిరాశపరచటంతో ఇప్పుడు వారిద్దరి కెరీర్ను గాడిలో పెట్టే బాధ్యతను తీసుకున్నాడు నాగ్.
అఖిల్ సినిమా తరువాత అక్కినేని నటవారసుడి రెండో సినిమా ఎవరితో అన్న చర్చ భారీగా జరుగుతోంది. అయితే ఈ చర్చలకు ఫుల్ స్టాప్ పెడుతూ వంశీ, అఖిల్ల కథను ఫైనల్ చేయాలంటూ క్లూ ఇచ్చేశాడు నాగ్. అంతేకాదు సోగ్గాడే చిన్ని నాయనా దర్శకుడితో తన సొంత బ్యానర్లో మరో సినిమా ఉంటుందన్న కింగ్, అది నాగచైతన్య హీరోగా తెరకెక్కనుందన్న విషయాన్ని కూడా కన్ఫామ్ చేశాడు. బుధవారం జరిగిన ఊపిరి థ్యాంక్స్ మీట్లో ఈ రెండు విషయాలపై క్లారిటీ ఇచ్చాడు కింగ్.
ప్రస్తుతం ఊపిరి సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న నాగార్జున, మరోసారి రాఘవేంద్ర రావు దర్శకత్వంలో చారిత్రక చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. తిరుమల శ్రీవేంకటేశ్వరుడి పరమ భక్తుడు హాథీరాం బాబాగా నటించనున్నాడు. ఈ వారంలోనే ప్రారంభం కానున్న ఈ సినిమా, రెండు నెలల తరువాత రెగ్యులర్ షూటింగ్కు వెళ్లనుంది. హాథీరాం బాబా క్యారెక్టర్ కోసం నాగ్ లుక్ మార్చుకోవడానికే ఇంత సమయం తీసుకుంటున్నట్టుగా తెలిపాడు నాగార్జున.