విమెన్స్‌ కాలేజీ బయట వెయిట్‌ చేసేవాణ్ణి! | Yuddham Sharanam Released on this friday | Sakshi
Sakshi News home page

విమెన్స్‌ కాలేజీ బయట వెయిట్‌ చేసేవాణ్ణి!

Published Fri, Sep 8 2017 1:23 AM | Last Updated on Sun, Sep 17 2017 6:32 PM

విమెన్స్‌ కాలేజీ బయట వెయిట్‌ చేసేవాణ్ణి!

విమెన్స్‌ కాలేజీ బయట వెయిట్‌ చేసేవాణ్ణి!

‘‘కొత్తవారిని ప్రోత్సహిస్తే ఇండస్ట్రీకి కొత్త కంటెంట్‌ వస్తుంది. ఇండస్ట్రీ ఎదుగుతుంది. డేర్‌ చేసి న్యూకమర్స్‌కు ఛాన్స్‌ ఇచ్చే ప్రొడ్యూసర్స్‌ రావాలి’’ అన్నారు నాగచైతన్య. ఆయన హీరోగా కృష్ణ ఆర్‌.వి. మారిముత్తు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘యుద్ధం శరణం’. వారాహి చలనచిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించారు. ఎస్‌.ఎస్‌ రాజమౌళి తనయుడు ఎస్‌. కార్తికేయ ఈ చిత్రానికి లైన్‌ ప్రొడ్యూసర్‌. నేడు ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగచైతన్య చెప్పిన విశేషాలు.

► ‘యుద్ధం శరణం’లో డ్రోన్‌ మేకర్‌ పాత్ర చేశాను. డ్రోన్‌ను ఒక క్యారెక్టర్‌లా డిజైన్‌ చేశాం. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సాగే లవ్‌స్టోరీ ఇది.  సినిమాలో యాక్షన్‌ అంతా బ్రెయిన్‌ అండ్‌ ఇంటెలిజెన్స్‌ మీద ఉంటుంది. సినిమా అంతా 24గంటల టైమ్‌ ఫ్రేమ్‌లో ఉంటుంది. స్క్రీన్‌ప్లే, కంటెంట్‌వైజ్‌గా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది. యూత్‌ బాగా కనెక్ట్‌ అవుతారనుకుంటున్నాను. అందుకే యూత్‌లోకి వెళ్లి సినిమా గురించి వాళ్లకు చెప్పి, వాళ్ల సపోర్ట్‌ కావాలని చెబుదామని కాలేజ్‌ టూర్స్‌ ప్లాన్‌ చేశాం. యూత్‌తో ఇంట్రాక్ట్‌ అవ్వడం, ముఖ్యంగా భీమవరంలో విమెన్స్‌ కాలేజీకి వెళ్లినప్పుడు చాలా బాగా అనిపించింది. నేనెప్పుడూ విమెన్స్‌ కాలేజీ బయట వెయిట్‌ చేయడమే కానీ, ఫస్ట్‌ టైమ్‌ విమెన్స్‌ కాలేజీ లోపలికి వెళ్లా. వారి రెస్పాన్స్‌ బాగా అనిపించింది (నవ్వుతూ).

ఫస్ట్‌ టైమ్‌ థ్రిల్లర్‌ జోనర్‌ ఎటమ్ట్‌ చేశాను. కానీ, ఆడియన్స్‌ అందరికీ నచ్చేలా, సినిమాలో అన్ని రకాల జోనర్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాం. స్క్రీన్‌ప్లే మాత్రం థ్రిల్లర్‌ ఫార్మాట్‌లో ఉంటుంది. ప్రతి పది నిమిషాలకు ఏదో ఒక కొత్త ఎలిమెంట్‌ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

డైరెక్టర్‌ కృష్ణ నాకు మంచి ఫ్రెండ్‌. నా ఫ్రెండ్‌ అనే అభిమానంతో  ఛాన్స్‌ ఇవ్వలేదు. అతను డైరెక్టర్‌ కావాలనే ఆశయాన్ని నమ్మాను. తను కూడా చాలా స్ట్రగుల్‌ అయ్యాడు. నాలుగైదేళ్లు వేరే వేరే డైరెక్టర్ల దగ్గర వర్క్‌ చేశాడు. రెండు, మూడు స్క్రిప్ట్స్‌ రాశాడు. అవి రిజెక్ట్‌ అయ్యాయి. ‘యుద్ధం శరణం’ స్క్రిప్ట్‌ నాకు, ప్రొడ్యూసర్‌కి అందరికీ నచ్చింది. కృష్ణను లాంచ్‌ చేయాలని కాకుండా, కథ నచ్చి చేశాం.

సాయి కొర్రపాటిగారు న్యూకమర్స్‌కు ఇచ్చే ప్రోత్సాహానికి హ్యాట్సాప్‌. ఈ సినిమాలో చాలా మంది కొత్తవారే. కొత్తవారిని ప్రోత్సహిస్తే ఇండస్ట్రీకి కొత్త కంటెంట్‌ వస్తుంది. ఇండస్ట్రీ గ్రో అవుతూ ఉంటుంది. ఇలా డేర్‌ చేసి న్యూకమర్స్‌కు ఛాన్స్‌ ఇచ్చే ప్రొడ్యూసర్స్‌ ఉండాలన్నది నా అభిప్రాయం. కార్తికేయ ఈ సినిమాకి లైన్‌ప్రొడ్యూసర్‌. జనరల్‌గా లైన్‌ప్రొడ్యూసర్‌ అంటే కంటెంట్‌ మీద అంత గ్రిప్‌ ఉండదు. ఆ రోజు షూటింగ్‌కి ఏది కావాలి? ఖర్చు ఎలా తగ్గించాలి? అని ఆలోచిస్తారు. కానీ, కార్తికేయకు డైరెక్టర్‌కు ఏం కావాలో, ప్రొడ్యూసర్‌కి ఏ బడ్జెట్‌లో ఫినిష్‌ చేయాలో తెలుసు.
 
చందూ మొండేటి డైరెక్షన్‌లో ‘సవ్యసాచి’ చేస్తున్నా. ఈ సినిమాలో హీరో లెఫ్ట్‌ హ్యాండ్‌కి, బ్రెయిన్‌తో కంట్రోల్‌ ఉండదు. రైట్‌ హ్యాండ్‌లో ఎంత పవర్‌ ఉంటుందో లెఫ్ట్‌ హ్యాండ్‌లోనూ అంతే పవర్‌ ఉంటుంది. అందుకే ఆ టైటిల్‌ పెట్టాం. సెప్టెంబర్‌ 20న తాత (అక్కినేని నాగేశ్వరరావు)గారి పుట్టినరోజు నాడు షూటింగ్‌ స్టార్ట్‌ చేయాలనుకుంటున్నాం. తర్వాత మారుతిగారి డైరెక్షన్‌లో ఓ మూవీ చేయబోతున్నా.


సింపుల్‌ వెడ్డింగ్‌.. గ్రాండ్‌ రిసెప్షన్‌
సమంతతో తన వివాహం గురించి నాగచైతన్య మాట్లాడుతూ – ‘‘అక్టోబర్‌ 6న గోవాలో పెళ్లి చేసుకోబోతున్నాం. 6న తెలుగు సంప్రదాయం ప్రకారం, 7న క్రిస్టియన్‌ సంప్రదాయం ప్రకారం మా పెళ్లిని సింపుల్‌గా ప్లాన్‌ చేశాం. రిసెప్షన్‌ని హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ఏర్పాటు చేయబోతున్నాం’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement