yuddham Sharanam
-
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
టైటిల్ : యుద్ధం శరణం జానర్ : యాక్షన్ థ్రిల్లర్ తారాగణం : నాగచైతన్య, లావణ్య త్రిపాఠి, శ్రీకాంత్, రావూ రమేష్, రేవతి.. సంగీతం : వివేక్ సాగర్ దర్శకత్వం : కృష్ణ ఆర్వీ మారిముత్తు నిర్మాత : సాయి కొర్రపాటి, రజనీ కొర్రపాటి వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న నాగచైతన్య యుద్ధం శరణం సినిమాతో మరోసారి మాస్ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేశాడు. చిన్ననాటి స్నేహితుడు కృష్ణ ఆర్వీ మారిముత్తును దర్శకుడిగా పరిచయం చేస్తూ వారాహి చలన చిత్రం బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కించారు. ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరోసారి విలన్ గా పరిచయం అవుతుండటం కూడా ఈ సినిమా మీద మంచి హైప్ క్రియేట్ చేసింది. మరి యుద్ధం శరణం ఆ అంచనాలను అందుకుందా..? మాస్ హీరోగా ప్రూవ్ చేసుకునేందుకు నాగచైతన్య చేసిన యుద్ధంలో గెలిచాడా..? కథ : అర్జున్ (నాగ చైతన్య) ఉదయం తొమ్మిదింటినుంచి సాయంత్రం ఐదింటికి వరకు రొటీన్ ఉద్యోగం చేయటం ఇష్టం లేని కుర్రాడు. జీవితంలో ఏదైన సాధించాలన్న పట్టుదలతో డ్రోన్ తయారు చేసే పనిలో ఉంటాడు. అమ్మ సీతాలక్ష్మీ (రేవతి), నాన్న మురళీ కృష్ణ(రావూ రమేష్)లే అర్జున్ ప్రపంచం. అక్క రాధిక, చెల్లెలు ధనుతో కలిసి అల్లరి చేస్తూ, ఫ్రెండ్స్ తో టైం పాస్ చేస్తూ హ్యాపిగా లైఫ్ గడిపేస్తుంటాడు. తన తల్లి దండ్రుల 30వ పెళ్లిరోజును గ్రాండ్ గా సెలెబ్రేట్ చేయాలని చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తాడు. కానీ అదే రోజు అర్జున్ వాళ్ల అమ్మానాన్న కనిపించకుండాపోతారు. ఒక్కసారిగా అర్జున్ జీవితం తలకిందులవుతుంది. అమ్మా నాన్నకు ఏమైందో తెలుసుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తాడు. కానీ చివరకు ఓ యాక్సిడెంట్ లో వాళ్లు చనిపోయారని తెలుస్తుంది. కానీ అది యాక్సిడెంట్ కాదని ఎవరో కావాలనే వాళ్లను చంపేశారన్న అర్జున్ కుటుంబానికి అనుమానం వస్తుంది. అదే సమయంలో నాయక్ అనే క్రిమినల్ అర్జున్ ఫ్యామిలీ వేటాడటం మొదలు పెడతాడు. అర్జున్ కుటుంబాన్ని నాయక్ ఎందుకు చంపాలనుకున్నాడు..? అర్జున్ వాళ్ల అమ్మానాన్నల చావుకు నాయక్ కు సంబంధం ఏంటి..? నాయక్ లాంటి రాక్షసుణ్ని అర్జున్ ఎలా ఎదిరించి గెలిచాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : కెరీర్ స్టార్టింగ్ నుంచి సీరియస్ రోల్లో ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న నాగచైతన్య యుద్ధం శరణం సినిమాతో మరోసారి అదే ప్రయత్నం చేశాడు. అయితే పూర్తి మాస్ సబ్జెక్ట్ కాకుండా థ్రిల్లర్ జానర్ ను ఎంచుకొని సక్సెస్ సాధించాడు. యాక్షన్ సీన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ లో ఆకట్టుకున్నాడు. గత చిత్రాలతో పోలిస్తే నాగచైతన్య నటనలో మంచి పరిణతి కనిపించింది. లావణ్య త్రిపాఠి పాత్రకు పెద్ద ఇంపార్టెన్స్ లేదు. కేవలం కథలో పాటలు రొమాన్స్ కోసమే ఆమె పాత్రను ఇరికినట్టుగా అనిపించింది. అయితే ఉన్నంతలో గ్లామర్ తో పాటు నటనతోనూ ఆకట్టుకుంది. సీనియర్ నటులు రేవతి, రావూ రమేష్ లు తమ అద్భుతమైన నటనతో సీతా లక్ష్మీ, మురళీ కృష్ణల పాత్రలకు ప్రాణం పోశారు. కుటుంబాన్ని ప్రేమిస్తూనే సమాజానికి ఏదైన సాయం చేయాలనే తపన పడే పాత్రలో ఒదిగిపోయారు. విలన్ గా మరోసారి తెలుగు తెర మీద కనిపించిన శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్రలో అలరించాడు. లుక్స్ తో పాటు నటనలోనూ విలనిజాన్ని అద్భుతంగా పండించాడు. సిస్టర్ క్యారెక్టర్ లో సీమా చౌదరి నటన ఆకట్టుకుంది. ఇతర పాత్రల్లో మురళీ శర్మ, రాజా రవీంద్ర, ప్రియదర్శి, రవివర్మలు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : తొలి సినిమాగా ఓ యాక్షన్ థ్రిల్లర్ సబ్జెక్ట్ ను ఎంచుకున్న దర్శకుడు కృష్ణ ఆర్వీ మారిముత్తు మంచి విజయం సాధించాడు. తొలి భాగం ఫ్యామిలీ, లవ్ సీన్స్ తో కాస్త నెమ్మదిగా నడిపించినా.. రెండో భాగంలో ఆడియన్స్ ను కట్టిపడేశాడు. యాక్షన్ సీన్స్ తో పాటు హీరో విలన్ ల మధ్య సాగే మైండ్ గేమ్ ఆడియన్స్ కు థ్రిల్ కలిగిస్తుంది. అయితే లవ్ స్టోరి విషయంలో ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కలగటానికి బలమైన కారణం కనిపించదు. సినిమాకు మేజర్ ఎసెట్ సినిమాటోగ్రాఫర్ నిఖేత్ బొమ్మిరెడ్డి. డ్రోన్ సీన్స్ తో పాటు నైట్ విజన్ కెమెరాతో షూట్ చేసిన సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తాయి. వివేక్ సాగర్ సంగీతం పరవాలేదు. ఫ్యామిలీ సాంగ్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : ఫ్యామిలీ ఎమోషన్స్ హీరో, విలన్ల మైండ్ గేమ్ మైనస్ పాయింట్స్ : లాజిక్ లేని లవ్ స్టోరి స్లో నేరేషన్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
విమెన్స్ కాలేజీ బయట వెయిట్ చేసేవాణ్ణి!
‘‘కొత్తవారిని ప్రోత్సహిస్తే ఇండస్ట్రీకి కొత్త కంటెంట్ వస్తుంది. ఇండస్ట్రీ ఎదుగుతుంది. డేర్ చేసి న్యూకమర్స్‌కు ఛాన్స్ ఇచ్చే ప్రొడ్యూసర్స్ రావాలి’’ అన్నారు నాగచైతన్య. ఆయన హీరోగా కృష్ణ ఆర్.వి. మారిముత్తు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘యుద్ధం శరణం’. వారాహి చలనచిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించారు. ఎస్.ఎస్ రాజమౌళి తనయుడు ఎస్. కార్తికేయ ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్. నేడు ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగచైతన్య చెప్పిన విశేషాలు. ► ‘యుద్ధం శరణం’లో డ్రోన్ మేకర్ పాత్ర చేశాను. డ్రోన్‌ను ఒక క్యారెక్టర్లా డిజైన్ చేశాం. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సాగే లవ్‌స్టోరీ ఇది. సినిమాలో యాక్షన్ అంతా బ్రెయిన్ అండ్ ఇంటెలిజెన్స్ మీద ఉంటుంది. సినిమా అంతా 24గంటల టైమ్ ఫ్రేమ్‌లో ఉంటుంది. స్క్రీన్‌ప్లే, కంటెంట్వైజ్గా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది. యూత్ బాగా కనెక్ట్ అవుతారనుకుంటున్నాను. అందుకే యూత్‌లోకి వెళ్లి సినిమా గురించి వాళ్లకు చెప్పి, వాళ్ల సపోర్ట్ కావాలని చెబుదామని కాలేజ్ టూర్స్ ప్లాన్ చేశాం. యూత్‌తో ఇంట్రాక్ట్ అవ్వడం, ముఖ్యంగా భీమవరంలో విమెన్స్ కాలేజీకి వెళ్లినప్పుడు చాలా బాగా అనిపించింది. నేనెప్పుడూ విమెన్స్ కాలేజీ బయట వెయిట్ చేయడమే కానీ, ఫస్ట్ టైమ్ విమెన్స్ కాలేజీ లోపలికి వెళ్లా. వారి రెస్పాన్స్ బాగా అనిపించింది (నవ్వుతూ). ► ఫస్ట్ టైమ్ థ్రిల్లర్ జోనర్ ఎటమ్ట్ చేశాను. కానీ, ఆడియన్స్ అందరికీ నచ్చేలా, సినిమాలో అన్ని రకాల జోనర్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాం. స్క్రీన్‌ప్లే మాత్రం థ్రిల్లర్ ఫార్మాట్లో ఉంటుంది. ప్రతి పది నిమిషాలకు ఏదో ఒక కొత్త ఎలిమెంట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ► డైరెక్టర్ కృష్ణ నాకు మంచి ఫ్రెండ్. నా ఫ్రెండ్ అనే అభిమానంతో ఛాన్స్ ఇవ్వలేదు. అతను డైరెక్టర్ కావాలనే ఆశయాన్ని నమ్మాను. తను కూడా చాలా స్ట్రగుల్ అయ్యాడు. నాలుగైదేళ్లు వేరే వేరే డైరెక్టర్ల దగ్గర వర్క్ చేశాడు. రెండు, మూడు స్క్రిప్ట్స్ రాశాడు. అవి రిజెక్ట్ అయ్యాయి. ‘యుద్ధం శరణం’ స్క్రిప్ట్ నాకు, ప్రొడ్యూసర్‌కి అందరికీ నచ్చింది. కృష్ణను లాంచ్ చేయాలని కాకుండా, కథ నచ్చి చేశాం. ► సాయి కొర్రపాటిగారు న్యూకమర్స్‌కు ఇచ్చే ప్రోత్సాహానికి హ్యాట్సాప్. ఈ సినిమాలో చాలా మంది కొత్తవారే. కొత్తవారిని ప్రోత్సహిస్తే ఇండస్ట్రీకి కొత్త కంటెంట్ వస్తుంది. ఇండస్ట్రీ గ్రో అవుతూ ఉంటుంది. ఇలా డేర్ చేసి న్యూకమర్స్‌కు ఛాన్స్ ఇచ్చే ప్రొడ్యూసర్స్ ఉండాలన్నది నా అభిప్రాయం. కార్తికేయ ఈ సినిమాకి లైన్‌ప్రొడ్యూసర్. జనరల్‌గా లైన్‌ప్రొడ్యూసర్ అంటే కంటెంట్ మీద అంత గ్రిప్ ఉండదు. ఆ రోజు షూటింగ్‌కి ఏది కావాలి? ఖర్చు ఎలా తగ్గించాలి? అని ఆలోచిస్తారు. కానీ, కార్తికేయకు డైరెక్టర్‌కు ఏం కావాలో, ప్రొడ్యూసర్‌కి ఏ బడ్జెట్లో ఫినిష్ చేయాలో తెలుసు. ► చందూ మొండేటి డైరెక్షన్లో ‘సవ్యసాచి’ చేస్తున్నా. ఈ సినిమాలో హీరో లెఫ్ట్ హ్యాండ్‌కి, బ్రెయిన్‌తో కంట్రోల్ ఉండదు. రైట్ హ్యాండ్లో ఎంత పవర్ ఉంటుందో లెఫ్ట్ హ్యాండ్‌లోనూ అంతే పవర్ ఉంటుంది. అందుకే ఆ టైటిల్ పెట్టాం. సెప్టెంబర్ 20న తాత (అక్కినేని నాగేశ్వరరావు)గారి పుట్టినరోజు నాడు షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. తర్వాత మారుతిగారి డైరెక్షన్లో ఓ మూవీ చేయబోతున్నా. సింపుల్ వెడ్డింగ్.. గ్రాండ్ రిసెప్షన్ సమంతతో తన వివాహం గురించి నాగచైతన్య మాట్లాడుతూ – ‘‘అక్టోబర్ 6న గోవాలో పెళ్లి చేసుకోబోతున్నాం. 6న తెలుగు సంప్రదాయం ప్రకారం, 7న క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం మా పెళ్లిని సింపుల్‌గా ప్లాన్ చేశాం. రిసెప్షన్‌ని హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ఏర్పాటు చేయబోతున్నాం’’ అన్నారు. -
రాజమండ్రిలో యుద్ధం శరణం టీం
-
జస్ట్... చైన్ హ్యాండ్ మారిందంతే!
మంగళవారం మన్మథుడు అక్కినేని నాగార్జున బర్త్‌డే. ఈ సందర్భంగా ‘రాజుగారి గది–2’లోని ఆయన లుక్‌ను విడుదల చేశారు. చూపుల్లో సీరియస్‌నెస్... చేతుల్లో రుద్రాక్షమాల... ఎప్పటిలా హ్యాండ్సమ్గా కనిపించారు నాగ్. రాజుగారి లుక్కు అక్కినేని అభిమానులకు మాంచి కిక్కిచ్చింది. తండ్రి రుద్రా క్షమాలతో కిక్ ఇస్తే.. తనయుడు నాగచైతన్య సైకిల్ చైన్‌తో ఎట్రాక్ట్ చేశారు. నాగ్ కెరీర్లో ఉన్న బెస్ట్ మాస్ మూమెంట్ ఏదని అడిగితే... వెంటనే అక్కినేని అభిమానులకు గుర్తొచ్చేది ‘శివ’ సిన్మాలో సైకిల్ చైన్ లాగే సీనే కదా. అంతలా ప్రేక్షకులపై ఆ సీన్ ఇంపాక్ట్ చూపింది. సరిగ్గా ఆ సీన్‌ను గుర్తు చేసేలా నాగచైతన్య తండ్రికి బర్త్‌డే విషెస్ చెప్పారు. చైతూ నటించిన తాజా సిన్మా ‘యుద్ధం శరణం’. నాగ్ బర్త్‌డే సందర్భంగా చైతూ సైకిల్ చైన్ పట్టుకున్న ఈ సినిమాలోని స్టిల్‌ను విడుదల చేశారు. అటు రుద్రాక్షమాలతో నాగార్జున... ఇటు సైకిల్ చైన్‌తో చైతూ... ఫ్యాన్స్‌కి గూస్బంప్స్ వచ్చాయంటే నమ్మండి! ఈ రెండు స్టిల్స్‌తో వాళ్లు ఫుల్ హ్యాపీ. అన్నట్టు... చైతూ నటించిన ఈ ‘యుద్ధం శరణం’ వచ్చే నెల 8న విడుదలవుతోంది. అప్పుడీ సైకిల్ చైన్ సీన్‌కి ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో చూడాలి!! -
‘యుద్ధం శరణం’ ప్రీ-రిలీజ్ వేడుక
-
నాకోసం నా కుటుంబంతో యుద్ధం చేయిస్తుంటా
– రాజమౌళి ‘‘ట్రైలర్‌ను బట్టి... ఓ సామాన్యుడు శక్తివంతమైన ప్రతినాయకుడితో యుద్ధం చేయడమనేది ఈ చిత్రకథ. నాకది బాగా నచ్చింది. చైతన్య కథల సెలక్షన్ బాగుంది. నేనైతే ఫ్యామిలీ కోసం యుద్ధం చేయను. నా కోసం నా ఫ్యామిలీతో యుద్ధం చేయిస్తుంటా’’ అన్నారు రాజమౌళి. నాగచైతన్య, లావణ్యాత్రిపాఠి జంటగా కృష్ణ మరిముత్తు దర్శకత్వంలో రజనీ కొర్రపాటి నిర్మించిన ‘యుద్ధం శరణం’ ప్రీ–రిలీజ్ వేడుక ఆదివారం జరిగింది. వివేక్ సాగర్ స్వరపరిచిన పాటల సీడీలను యం.యం. కీరవాణి, ట్రైలర్‌ను రాజమౌళి విడుదల చేశారు. తొలి సీడీని రాజమౌళి, డి. సురేశ్‌బాబు అందుకున్నారు. రాజమౌళి మాట్లాడుతూ– ‘‘నా సిన్మాలకు తప్ప మా ఆవిడ (రమా రాజమౌళి) ఇతర సిన్మాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేయదు. తనకేదీ ఓ పట్టాన నచ్చదు. నా సిన్మాల్లోనైనా ఏదైనా పాయింట్ బాగోలేదంటే నిర్మొహమాటంగా చెప్తుంది. కృష్ణ చెప్పిన కథ నచ్చడంతో ఈ సిన్మా చేయడానికి ఒప్పుకుంది. ‘‘బాహుబలి’లో ప్రతి పాత్రకు మనమెంత ప్రీ–వర్క్ చేశామో... కృష్ణ కూడా అలానే ఈ సిన్మాలో పాత్రలను డిజైన్ చేశాడు. ఈ సిన్మాకు వర్క్ ఎగ్జయిటింగ్‌గా ఉంది’’ అని చెప్పింది. తొలిసారి తనంత పాజిటివ్‌గా చెప్పడంతో సినిమాపై చాలా నమ్మకం ఏర్పడింది. తర్వాత సెట్‌కి వెళ్లినప్పుడు, ఇందులో కొన్ని డైలాగులు విన్నప్పుడు సినిమా హిట్టని ఫిక్సయ్యా’’ అన్నారు. ‘‘తెలుగులో కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో సాయిగారు కేరాఫ్ అడ్రస్. నేను, కృష్ణ 4వ తరగతి నుంచి క్లాస్మేట్స్. 8వ తరగతిలో ఒక అమ్మాయినే ప్రేమించాం. అప్పుడా యుద్ధంలో నేను గెలిచా. ఇప్పుడీ యుద్ధంలో తనే గెలుస్తాడు. వివేక్‌సాగర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సిన్మాలో హీరో ఎక్కువగా ఏ ఆయుధం వాడడు. కొత్తగా ఉంటుందీ సిన్మా’’ అన్నారు నాగచైతన్య. ‘‘చైతు, కృష్ణకీ మధ్య మంచి వేవ్‌లెంగ్త్ ఉంది. అది సెప్టెంబర్ 8న తెలుస్తుంది. నా సిన్మాల కంటే చైతూ సిన్మాలు బాగా ఆడాలని కోరుకుంటా’’ అన్నారు రానా. ‘‘చైతన్యగారితో నెక్ట్స్ మూవీ చేయాలనుకుంటున్నాం’’ అని మైత్రి మూవీ మేకర్స్ నవీన్ తెలిపారు. నిర్మాతలు శోభు యార్లగడ్డ, లగడపాటి శ్రీధర్, దర్శకుడు ఇంద్రగంటి, దర్శక–నటుడు అవసరాల పాల్గొన్నారు. -
వినాయక చవితికి రెండో పాట
రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో మంచి సక్సెస్ సాధించిన నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం యుద్ధం శరణం. వారాహి చలనచిత్రం బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాతో కృష్ణ ఆర్వీ మరిముత్తు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నాగచైతన్య సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుండగా వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇటీవల రాఖీ సందర్భంగా చిత్రయూనిట్ ఓ ఫ్యామిలీ సాంగ్ ను రిలీజ్ చేసింది. ఆ పాటతో సినిమాలోని ఫ్యామిలీ ఎమోషన్స్ పరిచయం చేసిన చిత్రయూనిట్ ఇప్పుడు సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేస్తోంది. వినాయకచవితికి ఒక రోజు ముందుగానే సినిమాలోని రెండో పాటను రిలీజ్ చేయనున్నారు. నాగోల్ లోని శ్రేయాస్ ఇంజనీరింగ్ కాలేజ్ లో పాటను లాంచ్ చేయబోతున్నట్టు హీరో నాగచైతన్య సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. Hey guys ! next single #YuddamSharanam from the film will be out tomorrow .. A solid track coming your way pic.twitter.com/SqMrVMr0RH — chaitanya akkineni (@chay_akkineni) 23 August 2017 -
బాహుబలి టీమ్‌లో...
అక్కినేని నాగచైతన్య ‘బాహుబలి’ టీమ్‌లో వర్క్ చేశారట! నిజమా... ‘బాహుబలి’ రెండు భాగాల్లో చైతూ ఎక్కడా కనిపించలేదే అనుకుంటున్నారా? అయితే... చైతూ వర్క్ చేసింది యాక్టర్‌గా కాదు. మరేం చేశారు? అంటే... డ్రోన్ ఆపరేటర్‌గా వర్క్ చేశారట! చైతూ హీరోగా వారాహి చలన చిత్రం సంస్థ నిర్మించిన సినిమా ‘యుద్ధం శరణం’. వచ్చే నెల 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో చైతూ డ్రోన్ ఆపరేటర్‌గా నటించిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... ‘బాహుబలి’కి వర్క్ చేసే డ్రోన్ ఆపరేటర్‌గా చైతూ కనిపిస్తారట. ఈ సినిమాకు రాజమౌళి తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ లైన్ ప్రొడ్యూసర్. ఆయనే ఇంట్రడక్షన్ సీన్స్‌లో హీరోని ‘బాహుబలి’ డ్రోన్ ఆపరేటర్‌గా చూపిస్తే బాగుంటుందనే ఐడియా ఇచ్చారట. అదీ మేటర్!! కృష్ణ ఆర్.వి. మరిముత్తు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో లావణ్యా త్రిపాఠి హీరోయిన్గా, శ్రీకాంత్ విలన్‌గా, రావు రమేశ్, మురళీ శర్మ, రేవతి ముఖ్యపాత్రల్లో నటించారు. వివేక్ సాగర్ సంగీతం అందించిన ఈ సినిమాకు రజనీ కొర్రపాటి నిర్మాత. -
యుద్ధం శరణం : రాఖీ స్పెషల్ సాంగ్
రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో మంచి సక్సెస్ సాధించిన నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం యుద్ధం శరణం. వారాహి చలనచిత్రం బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాతో కృష్ణ ఆర్వీ మరిముత్తు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నాగచైతన్య సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుండగా వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ రోజు(సోమవారం) రాఖీ సందర్భంగా చిత్రయూనిట్ ఓ ఫ్యామిలీ సాంగ్ ను రిలీజ్ చేసింది. 'అక్క చెల్లెల్లకు రాఖీ ఎందుకు కడతారో తెలుసా.. అమ్మా నాన్నల తరువాత వాళ్ల బాధ్యత అన్నా తమ్ముళ్లదే అని' అంటూ రేవతి చెప్పిన హార్ట్ టచింగ్ డైలాగ్స్ తో మొదలైన ఈ సాంగ్ కు శ్రేష్ట సాహిత్యం అందించగా ప్రదీప్ కుమార్ ఆలపించారు. Here you go guys Enno enno bhavala from #YuddhamSharanam https://t.co/Dhte4EOQ0g thank you for this @viveksagar2 — chaitanya akkineni (@chay_akkineni) 7 August 2017 -
యుద్ధం శరణం : రాఖీ స్పెషల్ సాంగ్
-
'ఇది ధైర్యం కాదు తెగింపు'
అక్కినేని వారసుడు నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ యుద్ధం శరణం. ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి వరుస హిట్స్ తో తెరకెతున్న ఈసినిమాకు కృష్ణ అర్వి మరిముత్తు దర్శకుడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ తోఆకట్టుకున్న యుద్ధం శరణం టీం తాజా ఇంట్రస్టింగ్ టీజర్ ను రిలీజ్ చేసింది. ఈ సినిమాతో చైతూ మరోసారి మాస్ హీరో ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడు. ఫ్యామిలీ శ్రీకాంత్ ఈ మూవీలో పూర్తి స్థాయి విలన్‌గా నటిస్తున్నాడు. చైతన్య సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గానటిస్తున్న ఈ సినిమాలో రావు రమేశ్, రేవతి, మురళీ శర్మ ప్రదాన పాత్రలు పోషిస్తున్నారు. వారాహి చలనచిత్రం బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ మూవీకి వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా రాజమౌళి తనయుడు కార్తీకేయ లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. -
ఆ రోజు బిగ్ ఫైట్ తప్పదా..?
ప్రస్తుతం సినీ రంగంలోని అందరి దృష్టి ఆగస్టు 11 మీదే ఉంది. లాంగ్ వీకెండ్‌ను క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో చాలా మంది స్టార్లు ఆగస్టు 11న తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే కెరీర్లో కీలకమైన సినిమాలతో బరిలో దిగుతున్న నలుగురు హీరోలు ఒకేసారి బరిలో దిగుతుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇలా ఒకేసారి నాలుగు సినిమా రిలీజ్ చేస్తే అందరికి నష్టమే అన్న టాక్ వినిపిస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న జయ జానకి నాయక సినిమాను ఆగస్టు 11న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. తేజ, రానాల కాంబినేషన్లో తెరకెక్కుతున్న నేనే రాజు నేనే మంత్రి సినిమాను కూడా అదే రోజు రిలీజ్ చేస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు. ఈ రెండు సినిమాలు ఇద్దరు హీరోల కెరీర్‌కు చాలా కీలకం దీంతో ఎలాగైన సక్సెస్ కొట్టాలని భావిస్తున్నారు. అదే సమయంలో మంచి ఫాంలో ఉన్న నితిన్ 'లై' సినిమాను ఆగస్టు 11నే రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు. అ..ఆ.. తో 50 కోట్ల క్లబ్లో చేరిన నితిన్ లైతో ఆ ఫాం కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు. ప్రేమమ్, రారంబోయ్ వేడుక చూద్దాం సినిమాలతో వరుస హిట్స్ అందుకున్ననాగచైతన్య కూడా యుద్ధం శరణం అంటూ అదే రోజు బరిలో దిగుతున్నాడు. మరి ఈ నలుగురు యువ కథానాయకుల్లో సక్సెస్ ఎవరి వరిస్తుందో చూడాలి. -
యుద్ధం.. శరణం
తప్పలేదు... శ్రీకృష్ణుడు అంతటి వ్యూహశాలికి అర్జునుడి చేత యుద్ధం చేయించక తప్పలేదు. న్యాయం కోసం గురువులు, బంధువులు, స్నేహితులపై అర్జునుడు విల్లు ఎక్కు పెట్టక తప్పలేదు. దాంతో మహా భారతంలో అన్నదమ్ముల మధ్య యుద్ధం తప్పలేదు. ఇప్పుడీ నయా భారతంలో నాగచైతన్య కూడా ‘యుద్ధం శరణం’ అంటున్నారు. ఆయన ఎవరిపై విల్లు ఎక్కుపెట్టారనేది వచ్చే నెలలో తెలుస్తుంది. నాగచైతన్య హీరోగా వారాహి చలనచిత్రం పతాకంపై రజని కొర్రపాటి నిర్మిస్తున్న తాజా సినిమాకు ‘యుద్ధం శరణం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కృష్ణ ఆర్.వి. మారిముత్తు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్‌ను ఆదివారం విడుదల చేశారు. వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి మాట్లాడుతూ – ‘‘పూర్తి స్థాయి యాక్షన్ చిత్రమిది. కథకు తగ్గ టైటిల్ కుదిరింది. ఇందులో నాగచైతన్య లుక్, యాటిట్యూడ్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో శ్రీకాంత్ నటిస్తున్నారు. ఆయనతో పాటు రావు రమేశ్, మురళీశర్మ, రేవతిల పాత్రలు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ నెల 15న టీజర్, తర్వాత ఆడియో విడుదల చేసి, వచ్చే నెలలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: సాయి శివాని, లైన్ ప్రొడ్యూసర్: కార్తికేయ, కథ: డేవిడ్ ఆర్. నాథన్, మాటలు: అబ్బూరి రవి, సంగీతం: వివేక్ సాగర్. -
'యుద్ధం శరణం' అంటున్న నాగచైతన్య
రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న నాగచైతన్య మరోసారి యాక్షన్ సినిమాతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కృష్ణ ఆర్వీ మరిముత్తు దర్శకత్వంలో వారాహి చలనచిత్రం బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు యుద్ధం శరణం అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తీకేయ ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరో శ్రీకాంత్ నెగెటివ్ రోల్ లో కనిపించనున్నాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. చైతూ సీరియస్ లుక్ లో కనిపిస్తున్న ఈ పోస్టర్ లో సినిమాలోని లీడ్ క్యారెక్టర్స్ అన్నింటిని రివీల్ చేశారు. ఆగస్టు సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.