యుద్ధం శరణం : రాఖీ స్పెషల్ సాంగ్ | yuddham Sharanam Rakhi special Song | Sakshi
Sakshi News home page

యుద్ధం శరణం : రాఖీ స్పెషల్ సాంగ్

Published Mon, Aug 7 2017 11:09 AM | Last Updated on Sun, Sep 17 2017 5:16 PM

యుద్ధం శరణం : రాఖీ స్పెషల్ సాంగ్

యుద్ధం శరణం : రాఖీ స్పెషల్ సాంగ్

రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో మంచి సక్సెస్ సాధించిన నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం యుద్ధం శరణం. వారాహి చలనచిత్రం బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాతో కృష్ణ ఆర్వీ మరిముత్తు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నాగచైతన్య సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుండగా వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ రోజు(సోమవారం) రాఖీ సందర్భంగా చిత్రయూనిట్ ఓ ఫ్యామిలీ సాంగ్ ను రిలీజ్ చేసింది. 'అక్క చెల్లెల్లకు రాఖీ ఎందుకు కడతారో తెలుసా.. అమ్మా నాన్నల తరువాత వాళ్ల బాధ్యత అన్నా తమ్ముళ్లదే అని'  అంటూ రేవతి చెప్పిన హార్ట్ టచింగ్ డైలాగ్స్ తో మొదలైన ఈ సాంగ్ కు శ్రేష్ట సాహిత్యం అందించగా ప్రదీప్ కుమార్ ఆలపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement