'యుద్ధం శరణం' అంటున్న నాగచైతన్య | naga Chaitanya New movie yuddham Sharanam | Sakshi
Sakshi News home page

'యుద్ధం శరణం' అంటున్న నాగచైతన్య

Published Sun, Jul 2 2017 11:45 AM | Last Updated on Tue, Sep 5 2017 3:02 PM

naga Chaitanya New movie yuddham Sharanam

రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న నాగచైతన్య మరోసారి యాక్షన్ సినిమాతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కృష్ణ ఆర్వీ మరిముత్తు దర్శకత్వంలో వారాహి చలనచిత్రం బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు యుద్ధం శరణం అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తీకేయ ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరో శ్రీకాంత్ నెగెటివ్ రోల్ లో కనిపించనున్నాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. చైతూ సీరియస్ లుక్ లో కనిపిస్తున్న ఈ పోస్టర్ లో సినిమాలోని లీడ్ క్యారెక్టర్స్ అన్నింటిని రివీల్ చేశారు. ఆగస్టు సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement