రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో మంచి సక్సెస్ సాధించిన నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం యుద్ధం శరణం. వారాహి చలనచిత్రం బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాతో కృష్ణ ఆర్వీ మరిముత్తు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నాగచైతన్య సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుండగా వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.