జస్ట్‌... చైన్‌ హ్యాండ్‌ మారిందంతే! | Rajangari's room-2 Nagarjuna look,yuddham sharanam movie Still release | Sakshi
Sakshi News home page

జస్ట్‌... చైన్‌ హ్యాండ్‌ మారిందంతే!

Published Wed, Aug 30 2017 12:07 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

జస్ట్‌... చైన్‌ హ్యాండ్‌ మారిందంతే! - Sakshi

జస్ట్‌... చైన్‌ హ్యాండ్‌ మారిందంతే!

మంగళవారం మన్మథుడు అక్కినేని నాగార్జున బర్త్‌డే. ఈ సందర్భంగా ‘రాజుగారి గది–2’లోని ఆయన లుక్‌ను విడుదల చేశారు. చూపుల్లో సీరియస్‌నెస్‌... చేతుల్లో రుద్రాక్షమాల... ఎప్పటిలా హ్యాండ్‌సమ్‌గా కనిపించారు నాగ్‌. రాజుగారి లుక్కు అక్కినేని అభిమానులకు మాంచి కిక్కిచ్చింది. తండ్రి రుద్రా క్షమాలతో కిక్‌ ఇస్తే.. తనయుడు నాగచైతన్య సైకిల్‌ చైన్‌తో ఎట్రాక్ట్‌ చేశారు. నాగ్‌  కెరీర్‌లో ఉన్న బెస్ట్‌ మాస్‌ మూమెంట్‌ ఏదని అడిగితే... వెంటనే అక్కినేని అభిమానులకు గుర్తొచ్చేది ‘శివ’ సిన్మాలో సైకిల్‌ చైన్‌ లాగే సీనే కదా.

అంతలా ప్రేక్షకులపై ఆ సీన్‌ ఇంపాక్ట్‌ చూపింది. సరిగ్గా ఆ సీన్‌ను గుర్తు చేసేలా నాగచైతన్య తండ్రికి బర్త్‌డే విషెస్‌ చెప్పారు. చైతూ నటించిన తాజా సిన్మా ‘యుద్ధం శరణం’. నాగ్‌ బర్త్‌డే సందర్భంగా చైతూ సైకిల్‌ చైన్‌ పట్టుకున్న ఈ సినిమాలోని స్టిల్‌ను విడుదల చేశారు. అటు రుద్రాక్షమాలతో నాగార్జున... ఇటు సైకిల్‌ చైన్‌తో చైతూ... ఫ్యాన్స్‌కి గూస్‌బంప్స్‌ వచ్చాయంటే నమ్మండి! ఈ రెండు స్టిల్స్‌తో వాళ్లు ఫుల్‌ హ్యాపీ. అన్నట్టు... చైతూ నటించిన ఈ ‘యుద్ధం శరణం’ వచ్చే నెల 8న విడుదలవుతోంది. అప్పుడీ సైకిల్‌ చైన్‌ సీన్‌కి ఏ రేంజ్‌ రెస్పాన్స్‌ వస్తుందో చూడాలి!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement