మోదీ నిర్ణయంతో డైలామాలో శుక్రవారం సినిమాలు | currency ban to effect friday releases | Sakshi
Sakshi News home page

మోదీ నిర్ణయంతో డైలామాలో శుక్రవారం సినిమాలు

Nov 9 2016 2:38 PM | Updated on Sep 22 2018 7:50 PM

మోదీ నిర్ణయంతో డైలామాలో శుక్రవారం సినిమాలు - Sakshi

మోదీ నిర్ణయంతో డైలామాలో శుక్రవారం సినిమాలు

500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ మోదీ తీసుకున్న నిర్ణయం పలు రంగాల మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒక్కసారిగా నిర్ణయాన్ని ప్రకటించి గంటల వ్యవధిలోనే అమలు చేయటంతో సినీ రంగంలో...

500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ మోదీ తీసుకున్న నిర్ణయం పలు రంగాల మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒక్కసారిగా నిర్ణయాన్ని ప్రకటించి గంటల వ్యవధిలోనే అమలు చేయటంతో సినీ రంగంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమాల మీద ఈ ప్రభావం తీవ్రంగా కనిపించనుంది.

ఇప్పటికే 500, 1000 రూపాయల నోట్లు చిత్తుకాగితాలుగా మారిపోవటం వంద రూపాయల నోట్లకు తీవ్ర కొరత ఏర్పడటంతో శుక్రవారం ఎంత మంది ప్రేక్షకులు థియేటర్ల వరకు వస్తారు అన్నది ప్రశ్నగా మారింది. దీంతో ఈ వారం రిలీజ్ అవుతున్న ఇంట్లో దెయ్యం నాకేం భయం, సాహసం శ్వాసగా సాగిపో చిత్రయూనిట్ లు ఆలోచనలో పడ్డారు. మరి ఈ గండం నుంచి అల్లరి నరేష్ నాగచైతన్యలు ఎలా బయట పడతారో చూడాలి.

అదే సమయంలో సెట్స్ మీద ఉన్న సినిమాలపై కూడా ఈ ప్రభావం భారీగానే కనిపిస్తోంది. ముఖ్యంగా సినిమా షూటింగ్ సమయంలో ఎక్కువగా రోజువారి పేమెంట్సే ఉంటాయి. అందుకోసం ఎక్కువగా 500, 1000 నోట్లనే వినియోగిస్తుంటారు నిర్మాతలు, ఒక్కసారిగా ఆ నోట్ల వినియోగం ఆగిపోవటంతో షూటింగ్ దశలో ఉన్న సినిమాలు కూడా తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement