ఒక్క రోజు ఆలస్యంగా..! | Allari Naresh Intlo deyyam nakem bhayam release Date | Sakshi
Sakshi News home page

ఒక్క రోజు ఆలస్యంగా..!

Published Wed, Nov 9 2016 11:57 AM | Last Updated on Mon, Sep 4 2017 7:39 PM

ఒక్క రోజు ఆలస్యంగా..!

ఒక్క రోజు ఆలస్యంగా..!

ఈ సారి సోలోగా సత్తా చాటాలనుకున్న అల్లరి నరేష్ ఆశలు మీద నాగచైతన్య నీళ్లు చల్లేశాడు. ఈ శుక్రవారం సోలో రిలీజ్ ప్లాన్ చేసుకున్న నరేష్ కు అదే రోజు నాగచైతన్య సాహసం శ్వాసగా సాగిపో రిలీజ్ అవుతుండటంతో కాస్త ఇబ్బంది ఎదురైంది. దీంతో అనుకున్నట్టుగా శుక్రవారం కాకుండా ఒక్క రోజు ఆలస్యంగా తన సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు నరేష్.

ఇటీవల తన స్థాయికి తగ్గ హిట్స్ ఇవ్వటంలో తడబడుతూ వస్తున్న యంగ్ హీరో నరేష్, సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ జానర్ అయిన హర్రర్ కామెడీనే నమ్ముకున్నాడు. కామెడీ స్పెషలిస్ట్ జి నాగేశ్వరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఇంట్లో దెయ్యం నాకేం భయం సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఈ శనివారం రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో నరేష్ తిరిగి సక్సెస్ ట్రాక్ లోకి రావాలని భావిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement