హమ్మయ్య.. రిలీజ్ డేట్ చెప్పారు
ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఓ వెలుగు వెలిగిన యంగ్ హీరో అల్లరి నరేష్, ప్రస్తుతం ఒక్క సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. కొంత కాలంగా తన రేంజ్ హిట్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న ఈ అల్లరోడు, త్వరలో ఇంట్లో దెయ్యం నాకేం భయం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా సక్సెస్ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు నరేష్.
అసలు ఇంట్లో దెయ్యం నాకేం భయం సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. మొదట పెద్ద సినిమాల రిలీజ్లు ఉన్నాయన్న కారణంతో తరువాత నోట్ల రద్దుతో పలుమార్లు వాయిదా పడింది. ఫైనల్గా ఈ నెల 30న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్, సాంగ్స్కు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో సినిమా సక్సెస్ మీద కాన్ఫిడెంట్ ఉన్నారు.. నరేష్ అండ్ టీం.