G Nageswara Reddy
-
ఆ విషయంలో విశ్వక్ సేన్‌దే తప్పు: డైరెక్టర్
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా- యంగ్ హీరో విశ్వక్ సేన్ల వివాదం చర్చనీయాంశంగా మారింది. తన కూతురు ఐశ్వర్యను టాలీవుడ్‌కు పరిచయం చేస్తూ అర్జున్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో విశ్వక్ హీరో! ఇప్పటికే అర్జున్ డైరెక్షన్లో రెండు షెడ్యూళ్ల షూటింగ్ కూడా పూర్తైంది. కానీ ఇంతలోనే సడన్‌గా సినిమా చిత్రీకరణను నిలిపేశారు. విశ్వక్ సేన్ షూటింగ్ హాజరు కాకుండా ఇబ్బంది పెడుతున్నాడని అర్జున్.. తన అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, అందుకే షూటింగ్ ఆపమన్నానంటూ విశ్వక్ బాహాటంగా విమర్శలు గుప్పించుకున్నారు. తాజాగా ఈ వివాదంపై ప్రముఖ దర్శకుడు జీ నాగేశ్వర రెడ్డి స్పందించాడు. 'కథ చెప్పకుండా సినిమా షూటింగ్ జరగదు. అయితే పక్కనుండే వాళ్లు కథ బాగోలేదు, కెరీర్లో ఇలాంటి సినిమా సెలక్ట్ చేసుకోవడం ఎందుకు అని చెప్పినప్పుడు కచ్చితంగా మైండ్ డిస్టర్బ్ అవుతుంది. కానీ విశ్వక్ సేన్ సొంత టాలెంట్‌తో పైకి వచ్చినవాడు. అతడంత ఆలోచనారహితంగా పని చేశాడనుకోను. కథ వినుంటాడు, నచ్చే ఉంటుంది. మరోపక్క అర్జున సూపర్ హిట్స్ అందించిన డైరెక్టర్. కథ చెప్పేశా కదా అని అర్జున్ తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయుంటాడు. ఈ జనరేషన్ హీరోలెలా ఉన్నారంటే ఏం జరుగుతుందో మొత్తం మాకు తెలియాలంటున్నారు. అవసరమైతే కథ ట్రీట్మెంట్లో కూడా కూర్చుంటున్నారు. మొత్తం 70 సీన్లు చెప్పాక షూటింగ్ మొదలుపెట్టుకుందామని విశ్వక్ ముందే అడిగి ఉంటే సరిపోయేది. అలా కాకుండా షూటింగ్ ఆపమని చెప్పడం కరెక్ట్ కాదు. ఈ విషయంలో హీరోదే తప్పు. ఇకపోతే ఈ విషయంలో అర్జున్ మీడియా ముందుకు రావడం, దానికి విశ్వక్ వివరణ ఇచ్చుకోవడం రెండు సరైనవే. ఒక్కోసారి మన చుట్టూ ఉండే మనుషుల వల్లే సమస్యలు వస్తాయి. ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఇద్దరూ డైరెక్ట్‌గా మాట్లాడుకుంటే ఆ ప్రాబ్లమ్స్ ఉండవు' అని చెప్పుకొచ్చాడు. చదవండి: అర్జున్ సర్జా- విశ్వక్ సేన్ వివాదం.. తెరపైకి యంగ్ హీరో -
'గాలి నాగేశ్వరరావు'గా మంచు విష్ణు
మంచు విష్ణు సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. ఈషాన్ సూర్య దర్శకత్వం వహించనున్న చిత్రంలో గాలి నాగేశ్వరరావు అనే డిఫరెంట్ మాస్ క్యారెక్టర్లో కనిపించనున్నారు విష్ణు. మంచు మోహన్‌బాబు ఆశీస్సులతో అవ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనున్నారు కోన వెంకట్. ‘‘తన కెరీర్లో ఇప్పటివరకూ చేయని సరికొత్త పాత్రతో ప్రేక్షకులను కనువిందు చేయబోతున్నారు విష్ణు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకి ఛోటా.కె. నాయుడు కెమెరామేన్‌గా, అనూప్ రూబెన్స్ సంగీత దర్శకునిగా వ్యవహరిస్తారు. ఈ చిత్రానికి డైరెక్టర్ జి. నాగేశ్వరరెడ్డి మూలకథ అందించగా, భాను, నందు డైలాగ్స్ రాస్తున్నారు. -
మంచి కథ కుదరకపోతే ఖాళీగా ఉంటా
‘‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమా తర్వాత నేను కామెడీ ఫిల్మ్ చేయలేదు. చాలా విరామం తర్వాత ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’ చిత్రంలో పూర్తి స్థాయి వినోదాత్మక పాత్ర చేశా. నాకు వినోదం అంటే చాలా ఇష్టం. అందుకే బాగా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశా. ప్రేక్షకులు రెండు గంటల ఎనిమిది నిమిషాలు పడి పడి నవ్వుతారు’’ అని సందీప్ కిషన్ అన్నారు. సందీప్ కిషన్, హన్సిక జంటగా నటించిన చిత్రం ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’. ‘కేసులు ఇవ్వండి ప్లీజ్’ అన్నది ఉపశీర్షిక. జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించారు. జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో ఎస్.ఎన్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జగదీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా సందీప్ కిషన్ మీడియాతో పంచుకున్న విశేషాలు. ►నా కెరీర్లో తొలిసారి ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’ సినిమాలో లాయర్ పాత్ర చేశా. కర్నూల్ టౌన్లో ఈ కథ సాగుతుంది. కోర్టులో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను పట్టుకుని కోర్టు బయట రాజీ చేయిస్తుంటా. అలాంటిది ఓ పెద్ద కేసుతో అనుకోని ఇబ్బంది వస్తుంది. దాన్ని ఎలా పరిష్కరించానన్నది ఆసక్తిగా ఉంటుంది. నా పాత్ర చాలా సరదాగా, నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. సింపుల్, స్వీట్ స్టోరీ ఇది. థ్రిల్ కలిగించే అంశాలూ ఉంటాయి. ►నాగేశ్వర రెడ్డిగారు అంటేనే వినోదం. ఈ టైమ్‌లో ఆయనలాంటి డైరెక్టర్ నాకు కుదరడం నేను సూపర్ లక్కీ. ఇలాంటి సినిమాల్లో నటించే అవకాశం అరుదుగా వస్తుంది. కథలో కామెడీ ఉండాలి కానీ, కామెడీ కోసం కథ ఉండకూడదు. మా సినిమా మొదటి కోవలోకి వస్తుంది. ►ప్రేక్షకులు నన్ను ఓ జానర్లో ఆదరించినప్పుడు వెంటనే మరో జానర్‌కి వెళ్లడంతో కొన్ని పరాజయాలు వచ్చాయి. అందుకే ప్రస్తుతం చాలా జాగ్రత్తగా కథలు ఎంచుకుంటున్నా. మంచి కథ కుదరకపోతే ఖాళీగా ఇంట్లో అయినా ఉంటాను కానీ, ఫ్లాప్ అయ్యే సినిమాలు మాత్రం చేయకూడదని నిర్ణయించుకున్నా. ‘నక్షత్రం’ సినిమా పరాజయం నుంచి బయటపడటానికి కొంచెం సమయం పట్టింది (నవ్వుతూ). ►హిందీలో ‘ది ఫ్యామిలీ మేన్’ అనే వెబ్ సిరీస్ తొలి భాగంలో మేజర్ విక్రమ్ పాత్రలో నటించా. చాలా మంచి స్పందన వచ్చింది. రెండో భాగంలో నేను ఉండను.. మూడో భాగంలో ఉంటా. తెలుగులోనూ గతంలో కంటే ప్రస్తుతం వెబ్ సిరీస్‌లు బాగా వస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ►ఓ సినిమా చేస్తున్నప్పుడే మూడు నాలుగు కథలు లాక్ చేసి పెట్టుకోవాలనుకోను. ఓ సినిమా విడుదలైన తర్వాతే మరో సినిమా గురించి ఆలోచిస్తా. ప్రస్తుతం నా దృష్టంతా ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’ సినిమాపైనే ఉంది. దీని తర్వాత ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ సినిమా ఒప్పుకున్నా. ఈ చిత్రంలో హాకీ ప్లేయర్ పాత్ర చేస్తున్నా. నా ప్రొడక్షన్లో రాహుల్ రామకృష్ణ–ప్రియదర్శిలతో ఓ సినిమా నిర్మించనున్నా. ‘ది ఫ్యామిలీ మేన్’ తర్వాత బాలీవుడ్లో వెబ్ సిరీస్‌లకు, సినిమాలకు అవకాశాలొచ్చాయి. అయితే ప్రస్తుతం నా దృష్టి తెలుగు చిత్రాలపైనే. తమిళంలో నేను నటించిన మూడు సినిమాలు రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నాయి. అవి విడుదలయ్యాకే వేరే తమిళ సినిమాల గురించి ఆలోచిస్తా. -
కర్నూలులో ‘తెనాలి రామకృష్ణ’ సందడి
-
కామెడీ ఎంటర్టైనర్గా ‘తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్’
హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో సందీప్ కిషన్. ఈ శుక్రవారం తమన్నా జోడిగా నెక్ట్స్ ఏంటి.? సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న సందీప్ కిషన్ మరో ఇంట్రస్టింగ్ సినిమాను ప్రకటించాడు. కామెడీ చిత్రాల దర్శకుడు జీ నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. నాగేశ్వర రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు(మంగళవారం) తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ సినిమాను ప్రకటించారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హన్సిక హీరోయిన్గా నటించనుంది. ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై తొలి ప్రయత్నంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అగ్రహారం నాగిరెడ్డి, సంజీవు రెడ్డి నిర్మాతలు. శేఖర్ చంద్ర సంగీతమందిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 14న సెట్ మీదకు వెళ్లనుంది. -
‘ఖండాంతరాలు దాటితే శాస్త్రాలు పలకవురా’
మంచు విష్ణు హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మరో కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ ఆచారి అమెరికా యాత్ర. బ్రహ్మానందం కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. సింగం 3 ఫేం అనూప్ సింగ్ థాకూర్ ప్రతినాయక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను పద్మజ పిక్చర్స్ బ్యానర్ పై కీర్తీ చౌదరి, కిట్టులు నిర్మిస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్‌తో ఆకట్టుకున్న ఆచారి అమెరికా యాత్ర యూనిట్, తాజాగా ఆసక్తికరమైన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. కామెడీ, రొమాన్స్, యాక్షన్ లతో రూపొందించిన ఈ సినిమా మంచు విష్ణు, జి.నాగేశ్వర్రెడ్డిలకు హ్యాట్రిక్ సక్సెస్ అందిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. -
‘ఆచారి అమెరికా యాత్ర’ మూవీ స్టిల్స్
-
హ్యాట్రిక్ హిట్ కోసం ‘ఆచారి అమెరికా యాత్ర’
మంచు విష్ణు హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మరో కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ ఆచారి అమెరికా యాత్ర. బ్రహ్మానందం కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా అలరించనుంది. సింగం 3 ఫేం అనూప్ సింగ్ థాకూర్ ప్రతినాయక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను పద్మజ పిక్చర్స్ బ్యానర్ పై కీర్తీ చౌదరి, కిట్టులు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్‌ను స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్‌తో ఆకట్టుకున్న ఆచారి అమెరికా యాత్ర యూనిట్, తాజాగా ఆసక్తికరమైన టీజర్ ను రిలీజ్ చేశారు. కామెడీ, రొమాన్స్, యాక్షన్ లతో రూపొందించిన ఈ సినిమా మంచు విష్ణు, జి.నాగేశ్వర్రెడ్డిలకు హ్యాట్రిక్ సక్సెస్ అందిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. Here is the #AchariAmericaYatra official teaser. This is such a laugh riot. Brahmi uncle at his besthttps://t.co/yUxAYJK6vZ — Vishnu Manchu (@iVishnuManchu) 7 January 2018 -
'ఆచారి అమెరికా యాత్ర' మొదలైంది
దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం లాంటి సూపర్ హిట్ చిత్రాల తరువాత మంచు విష్ణు, జి.నాగేశ్వర్రెడ్డిల కాంబినేషన్లో తెరకెక్కనున్న మూడో చిత్రం ఆచారి అమెరికా యాత్ర. సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం ఆచారి పాత్రలో నటిస్తున్నారు. ఢీ, దేనికైనా రెడీ చిత్రాల్లో సూపర్బ్ కామెడీతో ఆకట్టుకున్న విష్ణు, బ్రహ్మి జోడి మరోసారి తెర మీద నవ్వులు పూయించనుంది. ఎక్కువభాగం అమెరికాలో షూటింగ్ జరుపుకోనున్న ఆచారి అమెరికా యాత్ర సినిమా శనివారం లాంచనంగా ప్రారంభమైంది. పద్మజ పిక్చర్స్ బ్యానర్ పై ఎమ్ ఎల్ కుమార్ చౌదరి నిర్మిస్తున్న ఈ సినిమాలో విష్ణు, బ్రహ్మానందంలు కృష్ణమాచారి, అప్పలాచారిగా కనిపించనున్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఆచారి అమెరికా యాత్ర మంచు విష్ణు కెరీర్ లో మరో బిగ్ హిట్ గా నిలుస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. -
హమ్మయ్య.. రిలీజ్ డేట్ చెప్పారు
ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఓ వెలుగు వెలిగిన యంగ్ హీరో అల్లరి నరేష్, ప్రస్తుతం ఒక్క సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. కొంత కాలంగా తన రేంజ్ హిట్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న ఈ అల్లరోడు, త్వరలో ఇంట్లో దెయ్యం నాకేం భయం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా సక్సెస్ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు నరేష్. అసలు ఇంట్లో దెయ్యం నాకేం భయం సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. మొదట పెద్ద సినిమాల రిలీజ్లు ఉన్నాయన్న కారణంతో తరువాత నోట్ల రద్దుతో పలుమార్లు వాయిదా పడింది. ఫైనల్‌గా ఈ నెల 30న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో సినిమా సక్సెస్ మీద కాన్ఫిడెంట్ ఉన్నారు.. నరేష్ అండ్ టీం.