'గాలి నాగేశ్వరరావు'గా మంచు విష్ణు | Manchu Vishnu As Gali Nageswara Rao In Upcoming Film | Sakshi
Sakshi News home page

Manchu Vishnu: గాలి నాగేశ్వరరావుగా మంచు విష్ణు

Published Sat, Mar 5 2022 8:07 AM | Last Updated on Sat, Mar 5 2022 8:45 AM

Manchu Vishnu As Gali Nageswara Rao In Upcoming Film - Sakshi

మంచు విష్ణు సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. ఈషాన్‌ సూర్య దర్శకత్వం వహించనున్న చిత్రంలో గాలి నాగేశ్వరరావు అనే డిఫరెంట్‌ మాస్‌ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు విష్ణు. మంచు మోహన్‌బాబు ఆశీస్సులతో అవ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనున్నారు కోన వెంకట్‌.

‘‘తన కెరీర్‌లో ఇప్పటివరకూ చేయని సరికొత్త పాత్రతో ప్రేక్షకులను కనువిందు చేయబోతున్నారు విష్ణు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకి ఛోటా.కె. నాయుడు కెమెరామేన్‌గా, అనూప్‌ రూబెన్స్‌ సంగీత దర్శకునిగా వ్యవహరిస్తారు. ఈ చిత్రానికి డైరెక్టర్‌ జి. నాగేశ్వరరెడ్డి మూలకథ అందించగా, భాను, నందు డైలాగ్స్‌ రాస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement