కామెడీ ఎంటర్‌టైనర్‌గా ‘తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్‌’ | Tenali RamaKrishna BABL to Star Sundeep Kishan and Hansika | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 4 2018 4:37 PM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

Tenali RamaKrishna BABL to Star Sundeep Kishan and Hansika - Sakshi

హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో సందీప్ కిషన్‌. ఈ శుక్రవారం తమన్నా జోడిగా నెక్ట్స్‌ ఏంటి.? సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న సందీప్‌ కిషన్‌ మరో ఇంట్రస్టింగ్‌ సినిమాను ప్రకటించాడు. కామెడీ చిత్రాల దర్శకుడు జీ నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో సందీప్‌ కిషన్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది.

నాగేశ్వర రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు(మంగళవారం) తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్‌ సినిమాను ప్రకటించారు. అవుట్ అండ్‌ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హన్సిక హీరోయిన్‌గా నటించనుంది. ఎస్‌ఎన్‌ఎస్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై తొలి ప్రయత్నంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అగ్రహారం నాగిరెడ్డి, సంజీవు రెడ్డి నిర్మాతలు. శేఖర్ చంద్ర సంగీతమందిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 14న సెట్ మీదకు వెళ్లనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement