
లవ్... నాగచైతన్య సమంతలది! లండన్... వాళ్ల హనీమూన్ డెస్టినేషన్! అంతే కాదు... మ్యారీడ్ లైఫ్‌లో అవుటాఫ్ ఇండియా వెళ్లడమూ ఇదే ఫస్ట్ టైమ్! యస్... ఇప్పుడు చైతూ–సమంత లండన్‌లో ఉన్నారు. నిజం చెప్పాలంటే... వీళ్లిద్దరూ హనీమూన్‌కి న్యూయార్క్ వెళతారనుకున్నారంతా! కానీ, లండన్‌ను సెలెక్ట్ చేసుకున్నారు. వారం క్రితమే అక్కడికి వెళ్లారు. ఇండియాలో ఏ మూలకు వెళ్లినా... ఎవరోఒకరు గుర్తు పట్టి పలకరిస్తారు. మాంచి క్రేజీ కపుల్ అండ్ స్టార్స్ కూడా కదా!
లండన్‌లో అయితే... అంత ఇబ్బంది ఉండదు. అందువల్ల, స్వేచ్ఛగా విహరిస్తున్నారు. తాము స్టార్స్ అనే సంగతి మరిచి, చేతిలో చెయ్యేసుకుని చక్కగా సిటీ అంతటినీ చుట్టేస్తున్నారట. మధ్య మధ్యలో అభిమానుల కోసం కొన్ని అప్‌డేట్స్ ఇస్తున్నారనుకోండి! అలాగే, చెన్నై రిసెప్షన్‌లోని ఫొటోలను కొన్నిటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు సమంత. కొత్తగా పెళ్లైన ఈ జంట ఇంకో వారం రోజులు లండన్‌లోనే ఉంటారట! ఇండియా తిరిగొచ్చిన తర్వాత మళ్లీ ఎవరి షూటింగులతో వాళ్లు బిజీ బిజీ!!
Comments
Please login to add a commentAdd a comment