
వెంకటేశ్, నాగచైతన్య
గోదావరి నది ఒడ్డున ‘వెంకీ మామ’ హంగామా షురూ అయింది. అల్లుడు నాగ చైతన్యతో కలసి వెంకటేశ్ ఆటాపాటా మొదలెట్టారు. వీరి అల్లరి చూసి గోదావరి ప్రేక్షకులు తెగ సంబరపడిపోయారు. అక్కడితో ఆగకుండా ఆ ఆనందాన్ని సెల్‌ఫోన్స్‌తో షూట్ చేసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు. దీంతో ‘వెంకీ మామ’ టీమ్ కొంచెం గుస్సా అయ్యారని టాక్. కేయస్ రవీందర్ (బాబీ) దర్శకత్వంలో వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా ‘వెంకీ మామ’ అనే మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కుతోంది.
సురేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెంకీ సరసన పాయల్ రాజ్‌పుత్, చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమాలోనూ మామా, అల్లుడి పాత్రల్లో వెంకీ, చైతన్య కనిపిస్తారు. రైస్ మిల్ ఓనర్ పాత్రలో వెంకీ, మిలటరీ అధికారి పాత్రలో చైతన్య నటిస్తున్నారు. ఇటీవల షూట్ చేసిన కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఇలా జరగకుండా సెక్యూరిటీ గట్టిగా పెంచాలని ఫిక్స్ అయ్యారట చిత్రబృందం. ఈ ఏడాది ద్వితీయార్థంలో ‘వెంకీ మామ’ రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల.
Comments
Please login to add a commentAdd a comment