‘‘పెళ్లయిన తర్వాత చాలా సంతోషంగా ఉంటున్నాం. గొడవలేం పడటంలేదు. కానీ ప్రస్తుతం చేస్తున్న సినిమా కోసమే చాలా గొడవలు పడుతున్నాం’’ అంటున్నారు నాగచైతన్య, సమంత. పెళ్లి తర్వాత తొలిసారి ఈ ఇద్దరూ కలసి ‘మజిలీ’ (వర్కింగ్ టైటిల్) అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గరికపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య భార్యాభర్తలుగా కనిపించబోతున్నారు.
పెళ్లి తర్వాత సాగే మెచ్యూర్డ్ లవ్‌స్టోరీగా ఈ చిత్రకథ సాగుతుంది. ఇందులో సమంత, నాగచైతన్య పాత్రలు ఎక్కువగా గొడవలు పడుతుంటాయి. ఆ పేచీలన్నీ ఎందుకో తెలియాలంటే విడుదల వరకూ ఆగాల్సిందే. హైదరాబాద్‌లో కొంత పోర్షన్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్‌ను వైజాగ్‌లో ప్లాన్ చేశారట చిత్రబృందం. ఓ నాలుగు రోజులపాటు వైజాగ్ పరిసర ప్రాంతాల్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు దర్శకుడు శివ. ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment