
సమంత మతం మారలేదు : చైతూ
త్వరలో ఒక్కటవ్వబోతున్న టాలీవుడ్ యువజంట నాగచైతన్య, సమంతలపై రోజుకో వార్త వినిపిస్తోంది. వచ్చే ఏడాది నాగచైతన్య, సమంతల పెళ్లి జరగబోతోందంటూ అఫీషియల్గా కన్ఫామ్ అవ్వటంతో ఇప్పుడు మరిన్ని వార్తలు...
త్వరలో ఒక్కటవ్వబోతున్న టాలీవుడ్ యువజంట నాగచైతన్య, సమంతలపై రోజుకో వార్త వినిపిస్తోంది. వచ్చే ఏడాది నాగచైతన్య, సమంతల పెళ్లి జరగబోతోందంటూ అఫీషియల్గా కన్ఫామ్ అవ్వటంతో ఇప్పుడు మరిన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల సమంత, చైతూలు ఏదో పూజ చేస్తున్న ఫోటోలో మీడియాలో మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. అవి సమంత మతం మార్చుకునేందుకు చేసిన పూజలేనా..? అన్న చర్చ జరిగింది.
అయితే ఈ వార్తలపై నాగచైతన్య క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. గతంలో తన పెళ్లి విషయంలో ముందుగా స్పందించిన చైతూ సమంత మతం మారలేదని తెలిపాడు. నాగార్జున స్టూడియోలో నిర్వహిస్తున్న పూజలో పాల్గొన్నాం అంతే. నాకు మతంతో పని లేదు అంటూ క్లారిటీ ఇచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ యువ జంటపై వస్తున్న రూమర్స్కు బ్రేక్ పడాలంటే ఇద్దరు కలిసి బహిరంగ ప్రకటన చేయాల్సిందే అంటున్నారు సినీ జనాలు.