
లవ్వింపులు, కవ్వింపులు, నవ్వింపులు లేని సంసారం ఉంటుందా? చిన్ని చిన్ని అలకలు, పెద్ద పెద్ద గొడవలు లేని జంటలు కూడా ఉండవు. పూర్ణ, శ్రావణిల జీవితంలో ఇవన్నీ ఉన్నాయి. ఈ భార్యాభర్తల ప్రయాణంలో వచ్చిన మలుపులు ఏంటి? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. పూర్ణగా నాగచైతన్య శ్రావణిగా సమంత నటించిన చిత్రం ‘మజిలీ’. పెళ్లయ్యాక తొలిసారి నటించిన ఈ చిత్రంలో ఇద్దరూ భార్యాభర్తల పాత్రల్లోనే కనిపిస్తారు. శివనిర్వాణ దర్శకత్వంలో షైన్ స్క్రీ¯Œ ్స బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదల కానుంది.
శివ నిర్వాణ మాట్లాడుతూ – ‘‘ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే మధ్యతరగతి భర్తగా ఈ చిత్రంలో నాగచైతన్య కనిపిస్తారు. అలాగే సమంత తన నటనతో నవ్విస్తారు... ఏడిపిస్తారు. మరో కథానాయికగా నటించిన దివ్యాంశ కౌశిక్ పాత్ర కూడా ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉంటుంది. వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే మంచి ఎమోషనల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు 80 లక్షల వ్యూస్ వచ్చాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: విష్ణు శర్మ.