
‘‘చెప్పాల్సిన టైమ్‌లో థ్యాంక్యూ చెప్పడం అవసరం’’ అని కొన్ని రోజుల క్రితం నాగచైతన్య అన్నారు. ప్రస్తుతం ఆయన ‘థ్యాంక్యూ’ అనే సినిమా చేస్తున్నారు. అందుకే అలా అన్నారు. ‘మనం’ దర్శకుడు విక్రమ్ కుమార్‌తో మళ్లీ నాగచైతన్య చేస్తున్న సినిమా ఇది. వారం క్రితం ఈ చిత్రం షూటింగ్ రాజమండ్రిలో ఆరంభమైంది. మరోవారం పాటు జరుగుతుంది. ఇప్పటికే ఒక పాట చిత్రీకరించారు. ప్రస్తుతం సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇందులో చైతూ సరసన ఇద్దరు నాయికలు నటిస్తారు. ఇంకా కథానాయికలను అధికారికంగా ప్రకటించలేదు. అలాగే ఓ ప్రముఖ హీరోయిన్ కీలక పాత్ర చేస్తారని టాక్. ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment