
సమంత, విజయదేవరకొండ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. ‘మహానటి’నుంచి ఏర్పడిన వీరి స్నేహబంధం.. ఇప్పుడు మరింత బలంగా మారింది. దానికి కారణం ఇప్పుడు వీరిద్దరు కలిసి ఓ సినిమాలో నటించడమే. శివ నిర్వాణ దర్శకత్వంలో సామ్, విజయ్‌లు ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తమ 19వ సినిమాగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. షూటింగ్‌లో కాస్త విరామం దొరికినా చాలు వీరిద్దరు సరదాగా గేమ్స్ ఆడుతున్నారు.
(చదవండి: విజయ్ దేవరకొండపై హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్)
తాజాగా వీరిద్దరు కలిసి వెన్నెల కిశోర్‌తో కలిసి ఓ ఆన్‌లైన్ గేమ్ ఆడారు. ఇందులో సామ్ విజయం సాధించింది. ఈ విజయాన్ని ఇన్‌స్టా ద్వారా అభిమానులతో పంచుకుంటూ.. విజయ్ దేవరకొండ లాంటి ప్రత్యర్థులపై విక్టరీ సాధించడం ఎంతో సంతోషంగా ఉందని సామ్ రాసుకొచ్చింది. దీనిపై విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. ‘యుద్దం ప్రకటిస్తున్నా.. ఇకపై ప్రతి విక్టరీ రికార్డు అవుతుంది’అని ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment