
టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషనల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్, తరువాత గీత గోవిందం, టాక్సీవాలా లాంటి సక్సెస్‌లతో వర్సటైల్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం డియార్ కామ్రేడ్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో, క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నాడు.
ఈ సినిమాతో పాటు తమిళ డైరెక్టర్ ఆనంద్ దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామా ఇటీవల ప్రారంభమైంది. ఈ సినిమాలతో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు విజయ్ దేవరకొండ ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. నిన్నుకోరి సినిమా తరువాత మజిలీతో మరో హిట్ సాధించిన శివా నిర్వాణ దర్శకత్వంలో విజయ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుందట. హార్ట్ టచింగ్ ఎమోషనల్ డ్రామాలతో అలరించిన శివా.. విజయ్ కోసం ఎలాంటి కథను రెడీ చేశాడో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment