
సేమ్ బ్యానర్.. సేమ్ డైరెక్టర్.. సేమ్ రైటర్... కానీ హీరో చేంజ్ అయ్యాడట. ఏ బ్యానర్? ఏ డైరెక్టర్? ఏ రైటర్ అంటే.. డీవీవీ బేనర్, శివా నిర్వాణ, కోన వెంకట్. నాని హీరోగా శివా నిర్వాణ దర్శకత్వంలో డీవీవీ దానయ్య ‘నిన్ను కోరి’ నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు కోన వెంకట్ స్క్రీన్‌ప్లే అందించారు. ఇప్పుడు దానయ్య, శివా నిర్వాణ, కోన వెంకట్... రామ్‌ని కోరారు. రామ్ హీరోగా ఈ ముగ్గురూ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. శివ చెప్పిన లవ్‌స్టోరీకి ఇంప్రెస్ అయ్యారట రామ్. అంతేకాదు.. ఈ సినిమాకి కూడా కోన వెంకట్‌నే స్క్రీన్‌ప్లే అందించనున్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment