
శ్రీకాకుళం రూరల్: ‘సినీ ఇండ్రస్టీలో ఎనిమిదేళ్లు అవకాశాల కోసం తిరిగాను. రామ్‌గోపాల్‌వర్మ తెరకెక్కించిన రక్తచరిత్ర, పరశురాం డైరెక్షన్‌లో సోలో చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశా. గ్రామీణా ప్రాంతం నుంచి హైదరాబాద్ వెళ్లి లిరిక్ రైటర్‌గా పనిచేస్తూ చివరకు ‘నిన్నుకోరి’ సినిమాతో మీ ముందుకు వచ్చాను..’ అని డైరెక్టర్ ఎల్.శివ నిర్వాణ అన్నారు. గురజాడ విద్యాసంస్థలకు ఇటీవల వచ్చిన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు.
షార్ట్‌ఫిల్మస్ వల్ల అవకాశాలున్నాయా?
శివ: ప్రస్తుతం ప్రతి ఒక్కరి కెరీర్ స్టార్ట్ అయ్యేది షార్ట్ ఫిల్మ్‌తోనే. నేను కూడా లవ్ ఆల్ జీబ్రా అనే షార్ట్‌ఫిల్మ్ తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయగా రచయిత కోనవెంకట్ నుంచి పిలుపు వచ్చింది. మనం చేసే ఐదు నిమిషాల షార్ట్‌ఫిల్మ్‌లో మంచి మెసెజ్ ఉంటే సరిపోతుంది.
ఇండ్రస్టీలో ఎదురైన అనుభవాలేంటి?
శివ:కళామతల్లికి నమ్ముకున్న వారు ఎప్పటికైనా విజయం సాధిస్తారు. ఆ నమ్మకంతోనే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని చివరగా నిన్నుకోరి చిత్రంతో సక్సెస్ సాధించాను.
మీ కుటుంబ నేపథ్యం?
శివ:మాది విశాఖలోని సబ్బవరం గ్రామం. గ్రామీణ ప్రాంతం నుంచే ఇండ్రస్టీకి వెళ్లాను. ఎమ్మెస్సీ బీఈడీ చేశాను. రెండేళ్లు టీచర్‌గా పనిచేశాను. ఇంటర్ నుంచే కథలు రాయడం మొదలుపెట్టాను.
‘నిన్నుకోరి’ వెనుక ఏదైనా లవ్‌స్టోరీ ఉందా?
శివ:నా ఫ్రెండ్‌కు జరిగిన స్టోరీయే నిన్నుకోరిగా తీశాను.
యువతకు మీరిచ్చే సలహా?
శివ:చదువుల్లోనైనా, ఉద్యోగంలోనైనా, సినీ ఇండ్రస్టీలోనైనా అనుకున్నది సాధించాలంటే కృషి, పట్టుదల ఉండాలి. అపజయాలకు కుంగిపోవద్దు.
Comments
Please login to add a commentAdd a comment