
Vijay Devarakonda Shares Samantha Fake Photo From VD11: విజయ్ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లు శివ నిర్వాణ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. రీసెంట్‌గా ఈమూవీ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. #VD11 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను ప్రారంభించారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఈమూవీ పూజా కార్యక్రమాల్లో డైరెక్టర్ శివ నిర్వాణతో పాటు హరీశ్ శంకర్, బుచ్చిబాబు, కొరటాల శివ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కానీ హీరోయిన్‌గా నటిస్తున్న సమంత మాత్రం మిస్సయ్యింది.
చదవండి: హిందీ ‘జెర్సీ’ చూసిన నాని ఏమన్నాడంటే..
దీంతో ఈ ప్రాజెక్ట్ లాంచ్‌కు సామ్ ఎందుకు రాలేదు అన్న చర్చ మొదలైంది. సామ్ ఎక్కిడికెళ్లిందనే విషయంపై ఆరా తీయగా.. సామ్ ప్రస్తుతం దుబాయ్‌లో హాలీడే వేకషన్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిసిందే. అందువల్లే తను మూవీ ప్రారంభోత్సవానికి హజరు కాలేకపోయింది. ఇదిలా ఉంటే తాజాగా విజయ్ దేవరకొండ ఈ మూవీ పూజ ఫొటోను షేర్ చేశాడు. అయితే ఇందులో విజయ్ పక్కన సమంత కూడా ఉండటం గమనార్హం. దీంతో ఇది చూసి అంతా షాకవుతున్నారు. ఎందుకంటే ఈ మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సమంత లేకపోయినా విజయ్ షేర్ చేసిన ఫొటో ఎలా వచ్చిందా? అని చూస్తున్నారు.
చదవండి: మీలో ఆ టాలెంట్ ఉంటే.. ప్రభాస్ సినిమాలో ఛాన్స్
తీరా అది మార్ఫింగ్ చేసిన ఫొటో అని అర్థమైంది. కేవలం సమంతనే కాదు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణల ఫొటోలను కూడా విజయ్ మార్ఫింగ్ చేసి షేర్ చేశాడు. ఈ ఫొటోను తన ట్వీటర్ ఖాతాలో పంచుకుంటూ.. ‘ఇదే అసలైన పూజ ఫొటో. దీనిని ప్రచురించాల్సిందిగా మీడియాకు నా రిక్వెస్ట్’ అంటూ విజయ్ సరదాగా ట్వీట్ చేశాడు. ఇక విజయ్ ట్వీట్‌కు సమంత స్పందిస్తూ.. పడి పడి నవ్వుతున్న ఎమోజీలను జత చేసి రీట్వీట్ చేసింది. దీందో విజయ్ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
— Samantha (@Samanthaprabhu2) April 21, 2022
Comments
Please login to add a commentAdd a comment