నా భార్య అలా ఉండాలి.. అప్పుడే పెళ్లి చేసుకుంటా : విజయ్‌ దేవరకొండ | Vijay Devarakonda Interesting Comments About His Marriage Plans And Qualities Of Future Wife - Sakshi
Sakshi News home page

Vijay Devarakonda On His Marriage: నా భార్య అలా ఉండాలి.. అప్పుడే పెళ్లి చేసుకుంటా

Published Thu, Aug 31 2023 11:20 AM | Last Updated on Thu, Aug 31 2023 11:39 AM

Vijay Devarakonda Opens Up On His Marriage Plans - Sakshi

టాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్లలో విజయ్‌ దేవరకొండ ఒకరు. ఈ రౌడీ హీరో పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడన్నది ఈ మధ్య హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ విషయంపై ఖుషి సినిమా ప్రమోషన్‌లో భాగంగా పాల్గొన్న ఓ కార్యక్రమంలో విజయ్‌ స్పందించాడు.  ఖుషి మూవీ ప్రచారంలో భాగంగా బుధవారం  నేషనల్ వైడ్ అభిమానులతో క్యూ అండ్ ఏ నిర్వహించారు విజయ్‌. యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో ఈ క్యూ అండ్ ఏ లైవ్ స్ట్రీమ్ అయ్యింది.

(చదవండి: ఓటీటీలో సందడే సందడి.. ఇన్ని సినిమాలు రిలీజవుతున్నాయా?)

ఈ సందర్భంగా ఫ్యాన్స్‌ అడిగిన పలు ప్రశ్నలకు విజయ్‌ సమాధానం ఇచ్చాడు. ఈ క్రమంలో ఓ అభిమాని పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు? ఎలాంటి అమ్మాయి కావాలి? అని అడిగాడు. అతని ప్రశ్నకు విజయ్‌ ఓపికగా సమాధానం ఇచ్చాడు. ‘నన్ను కేరింగ్ గా చూసుకునే లైఫ్ పార్టనర్ కావాలని కోరుకుంటా. నేను పని లో పడి ఫుడ్ వంటి బేసిక్ థింగ్స్ కూడా మర్చిపోతా. వర్క్ నుంచి బయటకు తీసుకొచ్చి పర్సనల్ లైఫ్ గుర్తుచేసే భార్య ఉండాలి. ఇప్పుడు మా అమ్మ నా గురించి జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ ఇయర్, నెక్ట్ ఇయర్ అంటూ పెళ్లికి టైమ్, డేట్ ఫిక్స్ చేసుకోలేదు. మ్యారేజ్ చేసుకోవాలని అనిపించినప్పుడు తప్పకుండా చేసుకుంటా. అయితే పెద్ద హడావుడి లేకుండా నా  పెళ్లి జరగాలి. కానీ ఎవరికీ తెలియకుండా నేను ఆ విషయాన్ని దాచలేను’అని విజయ్‌ అన్నారు. 

డబ్బు, గౌరవం రెండూ ముఖ్యమే
నాకు లైఫ్ లో ఎన్నో సాధించాలని ఉంది. అందుకు కావాల్సిన ఇన్సిపిరేషన్ ఉంది. అందుకే నాకు ఎవర్నో చూసి ఇన్స్ పైర్ కావాల్సిన అవసరం రాలేదు. అమ్మా నాన్నలను బాగా చూసుకోవాలనే డ్రీమ్ ఉండేది. నెలకు ఇంటి అద్దె కంట్టేందుకు కూడా ఇబ్బంది పడిన సందర్భాలు చూశాను.  ఇలాంటి వాటి నుంచి బయటపడి కంఫర్ట్ గా ఉండాలనే డ్రీమ్ ఉండేది. అలాగే ఇంట్లో, ఫ్యామిలీలో, సొసైటీలో నేనంటే గౌరవం ఏర్పడాలని కోరుకున్నా. ఇవన్నీ చేయాలంటే మనం ధైర్యంగా ప్రయత్నాలుచేయాలి. లైఫ్ లో డబ్బు, గౌరవం ముఖ్యమని అనుకుంటా. నన్నెవరైనా అగౌరవంగా చూస్తే క్షమించను

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement