Kushi Twitter Review: ‘ఖుషి’ మూవీ ట్విటర్‌ రివ్యూ | Kushi Twitter Review: Vijay Deverakonda and Samantha Starred Movie - Sakshi
Sakshi News home page

Kushi Twitter Review: ‘ఖుషి’ మూవీ టాక్‌ ఎలా ఉందంటే..

Published Fri, Sep 1 2023 6:49 AM | Last Updated on Fri, Sep 1 2023 8:25 AM

kushi movie twitter review - Sakshi

సమంత, విజయ్‌ దేవరకొండ జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకుడు. లైగర్‌ లాంటి డిజాస్టర్‌ తర్వాత విజయ్‌ దేవరకొండ నుంచి వస్తున్న చిత్రమిది. ఇక ప్రేమ కథలు చేయనని శపథం చేసిన విజయ్‌.. లైగర్‌ ఎఫెక్ట్‌తో మళ్లీ లవ్‌స్టోరీకి మొగ్గు చూశాడు. విజయ్‌కి జోడిగా సమంత అని ఎనౌన్స్‌ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయింది. దానికి తోడు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్‌ సూపర్‌ హిట్‌ సాధించడంతో ‘ఖుషి’పై అంచనాలు పెరిగాయి. భారీ అంచనాల మధ్య నేడను (సెప్టెంబర్‌ 1) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పలు చోట్ల ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో పడిపోయింది.

దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.‘ఖుషి’ మూవీ ఎలా ఉంది? స్టోరీ ఏంటి? తదితర విషయాలు  ట్విటర్‌ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.

ఖుషి మూవీకి ట్విటర్‌లో పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. చాలా కాలం తర్వాత హిట్‌ కొట్టామని విజయ్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సమంత, విజయ్‌ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయిందని చెబుతున్నారు. కొన్ని సనివేశాలు సాగదీతగా అనిపించినా.. కామెడీ బాగుందని ఎక్కుమంది చెబుతున్నారు. ఇక చివరి 30 నిమిషాలు చాలా ఎమోషనల్‌గా సాగుతుందని, అది సినిమాకు చాలా ప్లస్‌ అని చాలా మంది కామెంట్‌ చేస్తున్నారు. 

చివరి 30 నిమిషాలు చాలా బాగుంది. విజయ్‌, సామ్‌ల కెమిస్ట్రీ తెరపై బాగా వర్కౌట్‌ అయింది. సంగీతం బాగుందంటూ ఓ నెటిజన్‌2.75 రేటింగ్‌ ఇచ్చాడు. 

అసలు కథ ప్రారంభం అవ్వడానికి కాస్త సమయం తీసుకున్నారు. అది మన సహనానికి పరీక్షగా మారుతుంది. కానీ సెకండాఫ్‌లో మాత్రం కామెడీతో పాటు ఎమోషన్‌ బాగా వర్కౌట్‌ అయింది. సమంత, విజయ్‌ల కెమిస్ట్రీ అదిరింది అంటూ మరో నెటిజన్‌ 3.5 రేటింగ్‌ ఇచ్చాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement