![Hari Hara Veera Mallu Movie Release Date Out - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/2/HariHaraVeeraMallu.jpg1_.jpg.webp?itok=qnU_JH5J)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్ వచ్చేసింది. పవన్ కల్యాణ్ పుట్టిన రోజు(సెప్టెంబర్ 2) పురస్కరించుకొని ఆయన హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’విడుదల తేదిని ప్రకటించింది చిత్ర యూనిట్. వచ్చే ఏడాది ఏప్రిల్ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ వజ్రాలదొంగ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో పవన్‌కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తోంది. అలాగే, ఔరంగజేబు పాత్రలో అర్జున్ రాంపాల్ నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కీరవాణి ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడెక్షన్స్ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment