
మామూలు సమయంలో ఆడియెన్స్ థియేటర్స్ కు రప్పించడం కష్టంగా మారుతోంది. ఎంత ప్రమోషన్ చేసినా సరే ప్రేక్షకులు తాము చూడాలనుకున్న సినిమాలను మాత్రమే థియేటర్స్ లో చూస్తున్నారు.అయితే సంక్రాంతి పండక్కి మాత్రం ఈ కండీషన్స్ పక్కన పెడుతున్నారు. ఫెస్టివల్ టైమ్ కు థియేటర్స్ వైపు చూస్తున్నారు.పొంగల్ కు విడుదలైన ప్రతి సినిమాను ఆదరించడం కొన్నేళ్లుగా ట్రెండ్ గా మారింది.
(చదవండి: ‘గుడ్‌బై’ చెప్పడం ఇష్టం లేదు : రష్మిక)
అందుకే వచ్చే సంక్రాంతి పండగని టార్గెట్ గా చేసుకుంటూ హీరోలు క్యూ కడుతున్నారు.ఇప్పటికే ప్రభాస్ ఆదిపురుష్ సినిమాతో వస్తున్నట్లు తెలిపాడు. మరోవైపు విజయ్ నటిస్తున్న వారసుడుతో పాటు ఉప్పెన ఫేమ్ వైష్ణవ్ తేజ్ నటిస్తున్న కొత్త సినిమాను కూడా ఇదే సీజన్ లో రిలీజ్ చేయబోతున్నారు.
ఆదిపురుష్, వారసుడు, వైష్ణవ్ తేజ్ కొత్త చిత్రాలు మాత్రమే కాదు.. రానున్న రోజుల్లో ఈ లిస్ట్ ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, బాబీ (కేఎస్ రవీంద్ర) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం కూడా సంక్రాంతి బరిలోకి దిగబోతుంది. అంతే కాదు అన్ని కుదిరితే అన్నయ్యతో పాటు ఈసారి తమ్ముడు పవన్ కల్యాణ్ కూడా హరిహర వీరమల్లు తో సంక్రాంతి బరిలోనే దిగే అవకాశాలు ఉన్నాయట.అదే నిజమైతే మెగా బ్రదర్స్ మధ్య సంక్రాంతి యుద్ధం నెక్ట్స్ లెవల్లో ఉండనుంది.
Comments
Please login to add a commentAdd a comment