Moushumi Chatterjee
-
15 ఏళ్లకు పెళ్లి, 17 ఏళ్లకే తల్లి.. యాటిట్యూడ్ వల్ల సినిమాలకు దూరం..
మనం ఎన్నో అనుకుంటాం. కానీ అందులో కొన్నే అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతాయి. విధి రాసిన స్క్రిప్ట్ ప్రకారమే జీవితం ముందుకు సాగుతూ ఉంటుంది. ఈ క్రమంలో జయాపజయాలు, కష్టసుఖాలు, ఒడిదుడుకులు.. ఇలా ఎన్నింటినో అనుభవించి తీరాల్సిందే! ఇప్పుడు చెప్పుకునే హీరోయిన్ సక్సెస్ అంటే తెలియని వయసులోనే ఘన విజయాన్ని అందుకుంది. చదువుకునే వయసులో తల్లిగా మారింది. ఆ తర్వాత దశాబ్దం పాటు హిందీ, బెంగాలీ ఇండస్ట్రీని ఏలింది. ప్రస్తుతం వెండితెరకు దూరంగా ఉంటోంది. ఇంతకీ ఆమె ఎవరు? తన కెరీర్ ఎందుకు ముగిసిపోయింది? అనేది ఈ కథనంలో చదివేద్దాం.. బాలికా బధు.. బెంగాలీ హిట్ మూవీ బాల్య వివాహాలు.. ఇప్పుడంటే తగ్గుముఖం పట్టాయి కానీ గతంలో విచ్చలవిడిగా జరిగేవి. ఈ వ్యవస్థ తీరును ఎండగడుతూ బాలికా బధు అని 1967లో ఓ బెంగాలీ సినిమా వచ్చింది. ఈ సినిమా బెంగాల్లో 75 వారాలకు పైగా ఆడి ప్లాటినం జూబ్లీ చేసుకుంది. ఇందులో నటించిన చిన్నారి బాలిక పేరు ఇందిర. స్క్రీన్ పేరు మౌసమి. ఈ సినిమా విశేష ఆదరణ పొందడంతో ఆ చిన్నారి పేరు మౌసమిగానే స్థిరపడిపోయింది. అప్పటికి ఆమె వయసు 10 ఏళ్లు. తనకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. కానీ ముందు చదువు పూర్తి చేయాలన్నది ఆమె తపన. ఆమె చివరి కోరిక.. చదువుకునే వయసులో.. అయితే ఆమె పదో తరగతి చదివే సమయంలో మౌసమి తండ్రి అక్క క్యాన్సర్‌తో చివరి స్టేజీలో ఉంది. తన పెళ్లి చూడాలన్నది ఆమె చివరి కల. ఆమె కోసం పదో తరగతి పరీక్షలు కూడా త్యాగం చేసింది. సంగీత దర్శకుడు, సింగర్ హేమంత్ రావు తనయుడు, నటుడు జయంత్ ముఖర్జీతో మౌసమి పెళ్లి జరిగింది. 15 ఏళ్లకే పెళ్లి చేసుకున్న ఆమె 17 ఏళ్లకే తల్లయింది. అత్తింటి ప్రోత్సాహంతో సినిమాల్లో అడుగుపెట్టింది. 1972లో అనురాగ్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ సక్సెస్‌తో పాటు అవార్డులు తెచ్చిపెట్టింది. అడ్జస్ట్‌మెంట్‌కు ఓకేనా? వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయిన మౌసమీకి పట్టిందల్లా బంగారమే అయింది. పదేళ్లకు పైగా హిందీ తెరను ఏలింది. కథానాయికగా ఓ పదిహేనేళ్లు చేసిన తర్వాత, సహాయ పాత్రలు చేసుకుంటూ పోయింది. అయితే అందరిలాగే తను కూడా క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొంది. అడ్జస్ట్‌మెంట్‌కు ఓకే అంటేనే సినిమా అవకాశాలిస్తామంటే కన్నెత్తి కూడా చూడలేదు. అలా కొన్ని హిట్ సినిమాలను వదిలేసుకుంది. ఇలా తన యాటిట్యూడ్ వల్ల చాలా సినిమాల నుంచి తీసేసారిన స్వయంగా మౌసమీయే చెప్పుకొచ్చింది. ఆమె చివరగా 2015లో వచ్చిన పీకూలో సినిమాలో నటించింది. ఆ తర్వాత వెండితెరపై కనిపించనేలేదు. చదవండి:గిన్నిస్ రికార్డు.. ఆయనే నా సూపర్ హీరో అంటున్న సుమ -
15 ఏళ్లకే పెళ్లి.. నా కడుపులో బిడ్డకు తండ్రెవరని అడిగాడు: నటి
'రోటీ కప్డా ఔర్ మకాన్', 'అనురాగ్' వంటి సినిమాలతో బాగా ఫేమస్ అయింది సీనియర్ నటి మౌసమి చటర్జీ. తన కెరీర్లో వందకుపైగా సినిమాలు చేసింది. ఆత్మగౌరవానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చే ఆమెను దివంగత స్టార్ నటుడు రాజేశ్ ఖన్నా దారుణంగా అవమానించాడట. తాజాగా ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది మౌశమి. నీ బిడ్డకు తండ్రి ఎవరు? మౌసమి మాట్లాడుతూ.. 'నేను గర్భవతిగా ఉన్నప్పుడు రాజేశ్ ఖన్నా ఓ ప్రశ్న అడిగాడు. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నీ భర్త జయంత ముఖర్జీయేనా? లేదంటే నటుడు వినోద్ మెహ్రానా? అని ప్రశ్నించాడు. నాకెంత కోపం వచ్చిందో! నిజానికి నటుడు వినోద్ మెహ్రా మంచి వ్యక్తి. అతడు మా పెళ్లికి కూడా వచ్చాడు. అయినా రాజేశ్ ఖన్నా చాలాసార్లు చండాలంగానే మాట్లాడేవాడు. ఈరోజు ఆయన లేరనుకోండి. నేను కూడా ఇచ్చిపడేశా రాజేశ్ చనిపోవడానికి కొద్ది రోజుల ముందు ఆయన అనారోగ్యంతో ఉంటే పరామర్శించడానికి వెళ్లాను. నా కూతురి ముందే నన్ను మెచ్చుకుంటూ ఏదేదో వాగాడు. మీ అమ్మ ఎంత పిచ్చిదంటే తనను చూసి మేమంతా భయపడేవాళ్లం. తను ఏదీ అంత ఈజీగా నమ్మేది కాదని చెప్పాడు. ప్రతిసారి నేనెందుకు భరిస్తాను. తనకు కూడా ఇచ్చిపడేశాను. తన పిల్లల వంక చూస్తూ వీళ్లు నీ పిల్లలా? లేదంటే రిషి కపూర్ సంతానమా? అని అడిగేశా. నా నుంచి ఇది ఊహించని రాజేశ్ నోట మాట రాక షాక్ అయిపోయాడు. కాంప్రమైజ్‌కు ఒప్పుకోలేదని.. ఇకపోతే 'దేశ్ ప్రేమి', 'బర్సాత్ కీ ఏక్ రాత్' వంటి ఎన్నో సినిమాలకు నేను సంతకం చేశాను. కానీ చివరకు నన్ను సినిమా నుంచి తీసేవారు. ఎందుకంటే వాళ్లు అడిగే కాంప్రమైజ్‌కు నేను ఒప్పుకునేదాన్ని కాదు. అడ్డదారిలో నేను సినిమాలు చేయలేను. చాలామంది సీనియర్ హీరోయిన్లు నువ్వింత అందంగా ఉన్నావు, టాలెంట్ ఉంది.. కానీ హీరోల ఫేవరెట్ లిస్టులో మాత్రం లేవని అంటూ ఉండేవారు. అయినా సరే, నాకు నచ్చకుండా ఏ పనీ చేసేదాన్ని కాదు' అని చెప్పుకొచ్చింది మౌసమి. 15 ఏళ్ల వయసులోనే పెళ్లి కాగా రాజేశ్ ఖన్నా హీరోయిన్ డింపుల్ కపాడియాను పెళ్లాడాడు. వీరికి ట్వింకిల్ ఖన్నా, రింక్ల్ ఖన్నా అని ఇద్దరు కూతుర్లు జన్మించారు. మౌసమి విషయానికి వస్తే ఆమె 15 ఏళ్ల వయసులోనే జయంత్ ముఖర్జీని పెళ్లాడింది. వీరికి మేఘ, పాయల్ అని ఇద్దరు కూతుర్లు సంతానం. పాయల్ చిన్నవయసులోనే మధుమేహం బారిన పడగా 45 ఏళ్ల వయసులో ఆమె మరణించింది. చదవండి: కడుపులో కణతి.. నటికి ఆపరేషన్.. 3 వారాలుగా బెడ్‌పైనే -
ప్రముఖ నటి కుమార్తె మృతి
ప్రముఖ బెంగాలీ నటి మౌసుమీ చటర్జీ కుమార్తె పాయల్ (45) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చనిపోయినట్లు బాలీవుడ్ హంగామా అనే వెబ్సైట్ తెలిపింది. చిన్నతనం నుంచే పాయల్‌కు మధుమేహ వ్యాధి ఉందని ఆ నివేదిక పేర్కొంది. కాగా మౌసుమీ చటర్జీ, ఆమె భర్త జయంతీ ఛటర్జీలు తన కూతురి ఆరోగ్య పరిస్థితి దృష్యా సంరక్షకులుగా తమకు అవకాశం కల్పించాలని బాంబే హైకోర్టులో నవంబర్ 2018లో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లో పాయల్ ఆరోగ్య పరిస్థితిని ఆమె భర్త డిక్కీ సిన్హా నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. పాయల్ తల్లిదండ్రుల పిటిషన్ ప్రకారం..పాయల్‌కి అందిస్తున్న ఫిజియోథెరపీ చికిత్సను అల్లుడు మధ్యలోనే ఆపేశాడని, వైద్యుడికి చెల్లించాల్సిన బకాయిలను చెల్లించలేదని తెలిపారు. పాయల్ వ్యాధి దృష్యా డాక్టర్ ఆమెకు సూచించిన ఆహార నియమాలను డిక్కీ నిర్లక్ష్యం చేశాడని తెలిపారు. పాయల్‌ను చూడడానికి కూడా ఆమె భర్త అనుమతిచ్చేవాడు కాదని తెలిపారు. చట్టబద్దంగా పాయల్ తన భార్య కనుక తల్లిదండ్రులకంటే ఆమెపై తనకే ఎక్కువ హక్కుంటుందంటూ డిక్కీ సిన్హా వాదించేవాడని తెలిపారు. కాగా మౌసుమీ బెంగాలీ చిత్రం బాలికా బధు చిత్రంతో అరంగేట్రం చేసింది. ఏప్రిల్ 26 1953న కలకత్తాలో జన్మించిన ఆమెకు 14ఏళ్ల ప్రాయంలోనే వివాహం జరిగింది. బెంగాలి దర్శకుడు తరుణ్ మజుందార్ ఆమె బాల్య వివాహాన్ని నేపథ్యంగా తీసుకొని ‘బాలికా బధు’ (1967-బాల్యవధువు) చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా బెంగాల్లో 75 వారాలకు పైగా ఆడి ప్లాటినం జూబ్లీ చేసుకుంది. ఆ తర్వాత మౌసుమీ చటర్జీ బెంగాలీతో పాటు హిందీలోనూ అగ్ర తారగా వెలుగొందారు. రాజేష్ ఖన్నా, శశి కపూర్, ధర్మేంద్ర, జితేంద్ర, సంజీవ్ కుమార్‌లతో సహా అప్పటి అగ్రశ్రేణి నటులతో ఆమె నటించింది. -
నాడు ప్రేయసి...నేడు వదిన..!
హిందీ రంగాన్ని ఒకప్పుడు ఉర్రూతలూగించిన తారల్లో మౌసమీ చటర్జీ ఒకరు. చక్కని రూపానికి మంచి అభినయం తోడవ్వడంతో మౌసమీ పదేళ్లకు పైగా హిందీ తెరను ఓ స్థాయిలో ఏలారు. హిందీలో చేసిన తొలి చిత్రం ‘అనురాగ్’లో అంధురాలిగా నటించి, శభాష్ అనిపించుకున్నారామె. ఆ తర్వాత అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రలు చాలానే చేశారు. కథానాయికగా ఓ పదిహేనేళ్లు చేసిన తర్వాత, సహాయ పాత్రలు చేయడం మొదలుపెట్టారు మౌసమీ. ఈ మధ్య అడపా దడపా మాత్రమే నటిస్తున్నారామె. ఈ నేపథ్యంలో ‘పీకు’ అనే చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపారని సమాచారం. సుజిత్ సర్కార్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, ఇర్ఫాన్‌ఖాన్ ముఖ్యతారలు కాగా, ఇటీవలే మౌసమీని ఎంపిక చేశారు. ఇందులో అమితాబ్‌కి వదినగా నటించనున్నారామె. అమితాబ్ బచ్చన్ సరసన ‘బేనామ్’, ‘మంజిల్’ తదితర చిత్రాల్లో నటించారు మౌసమీ. ఒకప్పుడు బిగ్ బీ సరసన ప్రేయసిగా నటించి, ఇప్పుడు ఆయనకు వదినగా చేయడం అంటే విశేషమే.