రాజేశ్ ఖన్నా, నేను ప్రేమించుకున్నాం: అనితా అద్వానీ
రాజేశ్ ఖన్నా, నేను ప్రేమించుకున్నాం: అనితా అద్వానీ
Published Wed, Sep 18 2013 2:53 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
బాలీవుడ్ నటుడు, సర్గీయ రాజేశ్ ఖన్నాతో చిన్నతనం నుంచే తనకు తెలుసు అని ఆయనతో సహజీవనం చేసిన అనితా అద్వానీ అన్నారు. కలర్ టెలివిజన్ చానెల్ లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ 7 కార్యక్రమంలో పాల్గొంటున్న అనితా .. వీజే ఆండీతో మాట్లాడుతూ.. మేమిద్దరం ప్రేమించుకున్నామని.. ఆయన భార్య డింపుల్ కపాడియాకు విడాకులు ఇవ్వకపోవడం కారణంగా పెళ్లి చేసుకోలేకపోయాం అని తెలిపారు.
బాలీవుడ్ నటి డింపుల్ కపాడియాతో 10 సంవత్సరాల వైవాహిక జీవితం అనంతరం నెలకొన్న విభేదాల కారణంగా రాజేశ్ ఖన్నా ఒంటరిగా జీవితం గడిపారు. మరణాంతరం ఆయన నివసించిన భవనం నుంచి అనితాను రాజేశ్ ఖన్నా కుటుంబ సభ్యులు కోర్టు నోటిస్ పంపడం వివాదంగా మారింది. రాజేశ్ ఖన్నా మరణాంతరం నెలకొన్న డిప్రెషన్ నుంచి బయటపడడానికే బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొంటున్నానని తెలిపారు.
Advertisement
Advertisement