
ధ్వజ స్తంభ ప్రతిష్ఠ చేస్తున్న అర్చకులు
జమలాపురం : తెలంగాణ తిరుపతి జమలాపురం శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలోని శ్రీఅలివేలు మంగ అమ్మవారి ఆలయ ధ్వజ స్తంభం శిథిలమై కూలిపోయింది. దీంతో అర్చకులు, అధికారులు పూజా కార్యక్రమాలను నిర్వహించి తాత్కాలిక ధ్వజ స్తంభాన్ని మంగళవారం పున:ప్రతిష్ఠ చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాస శర్మ, ముఖ్య అర్చకులు ఉప్పల విజయ దేవ శర్మ, ప్రభాకర్ శాస్త్రి, అర్చకులు కురవి సుబ్రహ్మణ్య శాస్త్రి, ఆలయ చైర్మన్ ఉప్పల శివ రాంప్రసాద్, ధర్మకర్త సభ్యులు శ్రీరాంచంద్రమూర్తి, సీనియర్ అసిస్టెంట్ విజయ కుమారి, సిబ్బంది కేవీఆర్ ఆంజనేయులు తదితరులున్నారు.