
జాతీయ జెండా ఆవిష్కరించిన వైఎస్ జగన్
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఘనంగా 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ రోజు ఉదయం లోటస్ పాండ్లో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నేతల సమక్షంలో ఆయన జెండాను ఎగురవేశారు. ఈ జెండా పండుగలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు స్వాతంత్ర్య పోరాటయోధుల చిత్రపటాలకు వైఎస్ జగన్ నివాళులర్పించారు.