సాక్షి, హైదరాబాద్: జాతీయ జెండాను అవమానించారంటూ యాదాద్రి ఆలయ ఈవోపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని రాష్ట్ర హైకోర్టు గురువారం కొట్టేసింది. యాదాద్రి ఈవోపై న్యాయవాది నర్సింగోజు నరేష్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయగా హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఆగస్టు 15న జెండా ఎగర వేయకుండా గోడకు అతికించారని పిటిషనర్ వాదించారు. అయితే, జాతీయ జెండా కార్యాలయం లోపల గోడకు అతికించవద్దని చట్టంలో ఎక్కడుందని హైకోర్టు ప్రశ్నించింది. జాతీయ జెండా బయటే ఎగరేయాలని చట్టంలో ఉందా అని సూటిగా ప్రశ్నించింది. కార్యాలయంలో అతికిస్తే జాతీయతను ప్రదర్షించినట్టే కదా అని చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ ఆరోగ్యం ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టేసింది.
(చదవండి: అద్భుతం.. అద్దాల మండపం)
‘జెండా అక్కడే ఎగరేయాలని ఎక్కడుంది’
Published Thu, Sep 17 2020 4:48 PM | Last Updated on Thu, Sep 17 2020 5:26 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment