శనివారం రాజ్‌భవన్ ఆవరణలో జెండా వందనం చేస్తున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
సాక్షి, హైదరాబాద్: ఎందరో బలిదానాలు, త్యాగాలు, ఉద్యమాల ద్వారా, అహింసాయుత స్వాతంత్య్ర పోరాటం వల్ల మన దేశానికి బ్రిటిష్ పాలన నుంచి విముక్తి లభించిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. ‘స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో భారత్ ఒక పేద దేశమని, భిన్నత్వం, వైరుధ్యాలున్నాయని, అభివృద్ధి చాలా కష్టమన్న అపోహలుండేవి. అయితే గత ఏడు దశాబ్దాల్లో భారత్ అనేక రంగాల్లో గొప్ప అభివృద్ధిని సాధించింది. ఒక బలమైన ప్రపంచ శక్తిగా ఎదిగింది’అని అన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం ఆమె రాష్ట్రంలోని వివిధ రంగాల ప్రముఖులతో రాజ్‌భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. త్వరలోనే హైదరాబాద్ నుంచి భారత్‌కు తొలి కోవిడ్ వ్యాక్సిన్ రానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను ‘ఎట్ హోమ్’కార్యక్రమం నిర్వహించనందుకు బాధపడ్డాను కానీ ఎన్నో రంగాలకు చెందిన ప్రముఖులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించినందుకు ఆనందంగా ఉందన్నారు. కాగా, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళిసై శనివారం రాజ్‌భవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment