71వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని నంద్యాలలోని బొమ్మలసత్రం సెంటర్‌లో మంగళవారం ఉదయం వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ప్రసంగిస్తూ.. ప్రతి ఒక్కరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు, వైఎస్ జగన్ అభిమానులు పాల్గొన్నారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ మంగళవారం నంద్యాలలోని పలు ప్రాంతాలలో పర్యటించబోతున్నారు. బొమ్మలసత్రం జంక్షన్ నుంచి నునెపల్లి ఫ్లైఓవర్, కోవెలకుంట్ల జంక్షన్ వరకు ఆయన రోడ్‌షో సాగనుంది. తిరిగి బొగ్గులైన్ మీదుగా గాంధీనగర్, ఎస్సీ కాలనీ, గాంధీనగర్ చౌరస్తా, ఇస్లాంపేట.. మూలసాగరం శివాలయం సర్కిల్, విశ్వాసపురం, జ్ఞానపురం కాలనీ, వైఎస్ ప్రభుదాస్‌రెడ్డి వీధి, పొగాకు కంపెనీ రోడ్డు మీదుగా.. మూలసాగరం, విశ్వాసపురం (చిన్నచర్చి) రోడ్డు వరకు వైఎస్ జగన్ ఉప ఎన్నికల ప్రచారం సాగనుంది.