పాతబస్తీలో పోలీసుల ఫ్లాగ్‌ మార్చ్ | Police conduct Flag march ahead of GHMC Polls | Sakshi
Sakshi News home page

పాతబస్తీలో పోలీసుల ఫ్లాగ్‌ మార్చ్

Published Fri, Jan 8 2016 8:11 PM | Last Updated on Tue, Oct 2 2018 7:21 PM

Police conduct Flag march ahead of GHMC Polls

యాకుత్‌పురా : జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో దక్షిణ మండల పోలీసులు శుక్రవారం సాయంత్రం మీర్‌చౌక్ డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ ఆధ్వర్యంలో చార్మినార్ నుంచి ప్రారంభమైన మార్చ్ మొఘల్‌పురా కమాన్, శాలిబండ రాజేశ్ మెడికల్ హాల్, లాల్‌దర్వాజా మోడ్, నాగులచింత, సుధా థియేటర్, గౌలిపురా మార్కెట్, సుల్తాన్‌షాహి, మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్, మస్కతీ దొడ్డి, మొఘల్‌పురా ఓల్టా హోటల్, బీబీబజార్ చౌరస్తా, అలిజాకోట్లా, ఎతేబార్ చౌక్, మీరాలంమండి, పురానీ హవేలి, డబీర్‌పురా వరకు కొనసాగింది.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. మార్చ్‌లో దక్షిణ మండలం అదనపు డీసీపీ కె.బాబురావు, మీర్‌చౌక్, చార్మినార్, ఫలక్‌నుమా, సంతోష్‌నగర్ ఏసీపీలు ఎం. శ్రీనివాస్ రావు, అశోక చక్రవర్తి, ఎం.ఎ.బారీ, వి. శ్రీనివాసులు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement