ఈ రోజు హ్యాపీ ఇండిపెండెన్స్‌ డే కాదు : అనసూయ | Anasuya Fires on Netizens in instagram live | Sakshi
Sakshi News home page

ఈ రోజు హ్యాపీ ఇండిపెండెన్స్‌ డే కాదు : అనసూయ

Published Wed, Aug 15 2018 3:30 PM | Last Updated on Wed, Aug 15 2018 3:55 PM

Anasuya Fires on Netizens in instagram live - Sakshi

స్వాతంత్ర్య దినోత్సవం రోజే ప్రముఖ యాంకర్‌, నటి అనసూయ ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో తీవ్ర నిరాశకు గురయ్యారు. నెటిజన్ల నెగటివ్‌ కామెంట్లపై స్పందిస్తూ.. తనకు ఈ రోజు హ్యాపీ ఇండిపెండెన్స్‌ డే కాదన్నారు. అంతకు ముందు 72వ స్వాతంత్ర్య దినోత్సవం రోజు తొలిసారి జెండా ఎగురవేసినందుకు ఆనందంగా ఉందంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. అంతేకాకుండా ఈ అవకాశం ఇచ్చిన భువనగిరిలోని హోటల్‌ వివేరా యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ, జెండా ఎగురవేసిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. స్వాతంత్రదినోత్సవ వేడుకల్లో, అది కూడా జాతీయ జెండాను ఎగిరేసే సమయంలో ఆ డ్రెస్‌ ఏంటి అంటూ నెటిజన్ల నుంచి కామెంట్ల రూపంలో విమర్శలు వచ్చాయి.

అసలేం జరిగిందంటే..
అనసూయ కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా బుధవారం ట్రిప్‌కు వెళ్లారు. అయితే తిరుగు ప్రయాణంలో హోటల్‌ వివేరాలో టిఫిన్‌ చేయడానికి ఆగారు. అదే సమయంలో హోటల్‌ వివేరా యాజమాన్యం వారు స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా జెండా ఎగరవేయడానికి ఏర్పాట్లు చేశారు. అనసూయ సెలబ్రిటీ కావడంతో ఆమెను జెండా ఎగరవేయాల్సిందిగా కోరారు. దీనికి అనసూయ కూడా అంగీకరించి, జాతీయ జెండాను ఎగురు వేశారు. అనుకోకుండా అప్పటికప్పుడు హోటల్‌ యాజమాన్యం వారు తనను జాతీయ జెండా ఎగురవేయాలని కోరడంతో జెండా ఎగురవేశానని అనసూయ తెలిపారు.

తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి కామెంట్లను చదివి వినిపిస్తూ.. ఒకానొక సమయంలో అనసూయ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. తన వస్త్రాధరణపై నెగటివ్‌గా కామెంట్లు పెడుతున్నవారిని బ్లాక్‌ చేస్తూ, తనలా ఆలోచించే వాళ్లు పదిమంది ఫాలోవర్లు ఉన్నా చాలని తెలిపారు. తన పోస్ట్‌లో (#HappyorNot) హ్యాపీ ఆర్‌ నాట్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌ ను కూడా జోడించారు. ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో పోస్ట్‌ చేసిన వీడియోను కొద్దిసమయం తర్వాత అనసూయ డిలీట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement