
అతిపెద్ద సవాలుగా అవినీతి: రాష్ట్రపతి
న్యూఢిల్లీ: దేశంలో అవినీతి అతిపెద్ద సవాలుగా మారిందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. రేపు 67వ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించారు. సిద్దాంతాలు, విలువలు పాటిస్తూ గాంధీజీ అడుగుజాడల్లో నడుద్దామని పిలుపు
ఇచ్చారు.
పార్లమెంట్, అసెంబ్లీలు జరుగుతున్న తీరుపై రాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారు. స్థిరమైన ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు వచ్చే ఎన్నికలు మంచి అవకాశంగా ఆయన పేర్కొన్నారు. పాకిస్థాన్‌ను దృష్టిలో పెట్టుకొని సహనానికి ఓ హద్దు ఉంటుందన్నారు.