దేశభక్తి
70వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని టౌన్ మోడల్ జూనియర్ కళాశాల విద్యార్థులు 500 అడుగుల భారీ జాతీయ పతకాన్ని ప్రదర్శించారు. గురువారం ఉదయం పదిన్నర గంటలకు కళాశాలలో ప్రిన్సిపాల్ చెన్నయ్య జెండా ఊపీ ప్రదర్శనను ప్రారంభించారు. అక్కడి నుంచి తెలుగుతల్లి విగ్రహం, చిన్నపార్కు, జెడ్పీ మీదుగా రాజ్ విహార్‌కు, మళ్లీ రాజ్‌విహార్ నుంచి కళాశాలలకు వరకు కొనసాగిన జాతీయ పతాక ప్రదర్శనలో దాదాపు 1000 మంది విద్యార్థులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
– కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు)