
అర్హాకు కేక్ తినిపిస్తున్న అల్లు అర్జున్
సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చినట్టున్నారు అల్లు అర్జున్. తదుపరి సినిమా షురూ చేయడానికి కంగారు పడటం లేదు. ఈ సమయాన్ని ఫ్యామిలీకి ఎక్కువగా కేటాయిస్తున్నారాయన. బుధవారం అల్లు అర్జున్ కుమార్తె అర్హా పుట్టినరోజు. అర్హా బర్త్‌డేను కుటుంబ సమేతంగా గోవాలో సెలబ్రేట్ చేసుకున్నారు అల్లు అర్జున్.
‘‘నా ^è బ్బీ డాల్ అర్హాకు రెండో బర్త్‌డే శుభాకాంక్షలు. తన బర్త్‌డేను గోవాలో సెలబ్రేట్ చేసుకున్నాం’’ అని పేర్కొన్నారు అల్లు అర్జున్. సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ నెక్ట్స్ త్రివిక్రమ్ దర్శకత్వంలో యాక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్‌లో సెట్స్ మీదకు వెళ్లనుంది. అలాగే తమిళ సూపర్ హిట్ ‘96’ రీమేక్‌లో కూడా అల్లు అర్జున్ కనిపిస్తారని టాక్.
Comments
Please login to add a commentAdd a comment