అల్లు అర్జున్
హడావిడిగా జిప్సీలో బయల్దేరారు సూర్య. గేర్లు మార్చుకుంటూ రయ్యిమని రోడ్డుపై దూసుకెళ్తున్న సూర్య సడన్‌గా బ్రేక్ వేశాడు. రోడ్డుపై ఫుల్ ట్రాఫిక్. జస్ట్.. అలా దిగాడు. నోట్లో సిగార్ కూడా ఉందట. అటు ఇటు చూశాడట. బడికెళ్లే పిల్లలు, ఆఫీసుకు వెళ్లే పెద్దలు అందరూ ఇబ్బంది పడుతున్నారు. అసలే... సూర్యకు కోపం ఎక్కువ. పైగా బోర్డర్ బ్యాగ్రౌండ్. ప్రాబ్లమ్ ఏంటీ అని ఆరా తీస్తే.. ఎవరో ఇద్దరు అమాయకుల్ని విలన్ రోడ్డుపై కొడుతున్నాడు. అంతే.. మండే సూర్యుడయ్యాడు సూర్య. ఆ తర్వాత హైవే పై ఏం జరిగింది? అంటే.. సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సిందే.
ఇలాంటి సీన్ ఒకటి ‘నా పేరు సూర్య– నా ఇల్లు ఇండియా’ సినిమాలో ఉందట. అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో కె.నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై శిరీషాశ్రీధర్ నిర్మిస్తున్న సినిమా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. బన్నీ వాసు సహనిర్మాత. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. సోల్జర్ సూర్య పాత్రలో అల్లు అర్జున్ నటిస్తున్నారు. ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోంది. సెట్‌లో అల్లు అర్జున్ వాలీబాల్ ఆడుతున్న ఫొటోలు హల్‌చల్ చేస్తున్నాయి. ఏప్రిల్ 26న సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment