
క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎంతటి రిస్క్‌కైనా సై అంటారు అల్లు అర్జున్. ఇందుకు ఆయన నటించిన గత చిత్రాలే నిదర్శనం. టాలీవుడ్ తొలి సిక్స్ ప్యాక్ హీరో బన్నీ. లాంగ్ హెయిర్‌తో ‘ఆర్య–2’లో కొత్త స్టైల్‌లో, ‘బద్రినాథ్’లో మరో స్టైల్‌లో, ‘సరైనోడు’, ‘డీజే’లో ఇంకో స్టైల్‌లో.. ఇలా డిఫరెంట్ లుక్స్‌లో కనిపించడానికి ఆసక్తి చూపిస్తారు. తాజాగా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’లో పవర్‌ఫుల్ సోల్జర్‌గా కనిపించనున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లుఅర్జున్ హీరోగా కె. నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
‘బన్నీ’ వాసు సహ నిర్మాత. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమాలోని ‘సైనిక’ సాంగ్‌ను ఈ రోజు ఉదయం 8 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ‘ఇల్లే ఇండియా..దిల్లే ఇండియా.. నీ తల్లే ఇండియా, ‘తెగువగు ధీరుడివని.. బలమగు భక్తుడని.. వేలెత్తి ఎలుగెత్తి భూమి... పిలిచింది నీ శక్తిని నమ్మి’ ఇటువంటి లిరిక్స్‌తో సాగే ఈ సాంగ్ సూపర్‌గా ఉండబోతుందని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 13న రిలీజ్ చేయనున్నారన్న వార్తల్లో వాస్తవం లేదంటున్నారు బన్నీ వాసు. ‘‘ప్రస్తుతానికైతే ముందు చెప్పినట్లుగానే ఏప్రిల్ 27న రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు బన్నీ వాసు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్–శేఖర్ స్వరాలు అందిస్తున్న ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయిక.
Comments
Please login to add a commentAdd a comment