
అల్లు అర్జున్
హీరో అల్లు అర్జున్ బర్త్‌డే ఇవాళ. ‘గంగోత్రి’ టు ‘డీజే’.. బన్నీ ప్రయాణం పదిహేనేళ్లు. ఈ 15 ఏళ్లల్లో హీరోగా ఇప్పటివరకు 18 సినిమాలు చేశారు. ఇక బన్నీ బర్త్‌డే విషయాని కొస్తే.. విశాఖపట్నం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అక్కడి ఆర్కే బీచ్‌లో 5 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి అవార్డు గ్రహీత మానస్ శేషు ఆధర్వంలో ఈ సైకత శిల్పం రూపొందింది. ‘‘అల్లు అర్జున్ అభిమానుల కోరిక మేరకు తయారు చేసిన అందమైన కానుక ఇది’’ అన్నారు మానస్.
ఈ సంగతి ఇలా ఉంచితే.. అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో కె. నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్న సినిమా ‘నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’. ‘బన్నీ’ వాసు సహనిర్మాత. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా డైలాగ్ ఇంపాక్ట్‌ను ఈ రోజు విడుదల చేయనున్నారు. ఈ చిత్రం మే 4న రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment