
యస్... ఏప్రిల్ 27నే! అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ను ఆ రోజునే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు చిత్రనిర్మాత లగడపాటి శిరీషా శ్రీధర్ వెల్లడించారు. రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమ తాజా షెడ్యూల్ వచ్చే నెల 5న హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. చిత్రసమర్పకులు కె. నాగబాబు మాట్లాడుతూ– ‘‘నెల రోజుల పాటు హైదరాబాద్ షెడ్యూల్ జరుగుతుంది. ఇందులో ఇంపార్టెంట్ సీన్స్‌తో పాటు హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తాం.
వచ్చే ఏడాది ఏప్రిల్ 27న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ చిత్రమిది. ఏప్రిల్ 27... అల్లు అర్జున్ అభిమానులు పెద్ద పండగ చేసుకునే రోజు. వరల్డ్ వైడ్‌గా అత్యధిక థియేటర్లలో ఆ రోజున చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని సహనిర్మాత ‘బన్నీ’ వాసు అన్నారు. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా, తమిళ నటుడు అర్జున్, శరత్‌కుమార్ ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: రామ్–లక్ష్మణ్, సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవన్, కెమెరా: రాజీవ్ రవి, సంగీతం: విశాల్–శేఖర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాబు.
Comments
Please login to add a commentAdd a comment