
లైట్‌గా ఫేస్‌కట్ ఛేంజైంది. ఆర్మీ హెయిర్ స్టైల్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఫిజిక్ కాస్త పెరిగింది. మొత్తంగా అల్లు అర్జున్ న్యూ లుక్ అదిరింది. వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘నా పేరు సూర్య– నా ఇల్లు ఇండియా’. ఇందులో అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. క్యారెక్టర్ పేరు సూర్య.
ఈ పాత్ర కోసమే అల్లు అర్జున్ ఇలా మేకోవర్ అయ్యారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఊటీలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్–శేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కె. నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్‌లో శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.