గాటు కథేంటి గురూ! | Naa Peru Surya Poster Impact | Sakshi
Sakshi News home page

గాటు కథేంటి గురూ!

Published Fri, Mar 2 2018 12:30 AM | Last Updated on Fri, Mar 2 2018 12:30 AM

Naa Peru Surya Poster Impact - Sakshi

అల్లు అర్జున్‌

నోట్లో సిగార్‌... చేతిలో స్టీరింగ్‌.. డిఫరెంట్‌ హెయిర్‌స్టైల్‌తోపాటు కండలు తిరిగిన దేహంతో ఫ్యాన్స్‌కి ‘హోలీ’ ఫీస్ట్‌ ఇచ్చాడు సూర్య. ‘పోస్టర్‌ ఇంపాక్ట్‌’ అంటూ ఈ పోస్టర్‌ని చిత్రబృందం రిలీజ్‌ చేసింది. అల్లు అర్జున్‌ టైటిల్‌ రోల్‌లో వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’.

గురువారం రిలీజైన పోస్టర్‌లో సూర్య ఎడమ కంటిపై గాటు ఉంది గమనించారా? ఇప్పుడు చర్చంతా ఆ గాటు గురించే. గాటు కథేంటి గురూ అని ఎవరికి తోచిన కథలు వాళ్లు అల్లుతున్నారు. అసలు కథ ఏంటో మే 4న తెలిసిపోతుంది. ప్రస్తుతం ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను హైదరాబాద్‌లో షూట్‌ చేస్తున్నారు. ఈ నెల 14వరకు ఈ షెడ్యూల్‌ జరుగుతుంది. కె.నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీక్రియేషన్స్‌ పతాకంపై శిరీషాశ్రీధర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘బన్నీ’ వాసు సహనిర్మాత.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement